తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు గత నలుగు సంవత్సరాలుగా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్,ఎకరానికి 8వేల పెట్టుబడి ,భూరికార్డుల ప్రక్షాళన..కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్,మిషన్ కాకతీయ ,మిషన్ భాగీరధ..ఇలా పలు అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నారు.అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న జనరంజక పాలనపై ప్రధాని మోడీ ఏ కాకుండా కేంద్రమంత్రులు ,సినీ నటులు,పలువురు ప్రముఖులు వరుసగా ప్రశంసలు వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.
see also :తెలంగాణ బీజేపీకి సీనియర్ నేత గుడ్‌బై
ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటుడు సుమన్ సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ఆదివారం రాష్ట్రంలోని హుజూర్ నగర్లో పర్యటించిన సుమన్..విలేకరులతో మాట్లాడారు. కాశ్మీర్ నుడి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఏక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తూ సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించాడని ప్రశంసించారు.తెలుగు రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్న ప్రభుత్వాలు తాను కోరుకున్న విధంగా ప్రజలకు సేవలందిస్తే.. తాను వారికి మద్దతుగా ప్రచారం, ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి స్ధిదమని స్పష్టం చేశారు .అయితే సుమన్ చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి.కాగా త్వరలోనే హిరో సుమన్ టీఆర్ఎస్ పార్టీ లో చేరుతారు అని పలువురు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
see also :చంద్రబాబు రూ.లక్షలకోట్ల అవినీతిని ఏకి పారేసిన హీరో శివాజీ..!!