పార్లమెంట్ చివరిదశ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుండి మొదలు కానున్నాయి .అయితే దాదాపు ఒక నెల రోజుల తరువాత జరగబోతున్న ఈ సమావేశాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం, మోడీ సర్కార్ ను నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగడం ఖాయంగా కన్పిస్తోంది. బ్యాంకు కుంభకోణాలపై 267 నిబంధన కింద చర్చించాలని ఇప్పటికే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌కు కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ నోటీసు ఇచ్చారు.అలాగే బ్యాంకు కుంభకోణాలపై ప్రధాని సమాధానం కోసం పట్టుబడతామని ఆయన తెలిపారు.మరోవైపు ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ‘ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్లు’ను తీసుకొస్తున్నామని తెలుపుతూ ప్రతిపక్షాల ప్రశ్నలకు దీటుగా బదులిచ్చేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది.బడ్జెట్ సమావేశాల చివరిదశలో సాధారణంగా వివిధ శాఖలకు అవసరమైన నిధుల కేటాయింపుపై చర్చలు కొనసాగుతాయి. అలాగే ఆమోదం కోసం ఉభయ సభల్లో ప్రభుత్వం కొన్ని బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది.
see also :తెలంగాణ బీజేపీకి సీనియర్ నేత గుడ్‌బై
see also :దేశ రాజకీయాలు మారాలంటే సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తులకే సాధ్యం