Home / LIFE STYLE / దానిమ్మ పండు తింటే ఇన్ని ప్రయోజనాలా..?

దానిమ్మ పండు తింటే ఇన్ని ప్రయోజనాలా..?

ఏక్ ఫల్ ..సౌ భీమారియ..దానిమ్మ పండుకు హిందీలో ఉన్న సామెత.. అంటే అనేక రోగాలకు దానిమ్మ ఒక సమాధానం అన్న మాట .రుచికి రుచి..ఆరోగ్యానికి ఆరోగ్యం .ఇది పండు కన్నా ఔషధ రూపంలోనే ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది.అనేక కారణాల వల్ల వచ్చే శరీరక రుగ్మతల నుండి దానిమ్మ మనల్ని కాపాడుతుంది.దానిమ్మలో మిటమిన్ సి ,సిట్రిక్ యాసిడ్ ,పోటాషియం ,ఫైబర్ మరియు కేన్సర్ వ్యాధిని నిరోధించే ఆసిడ్స్ ఉన్నాయి.అంతేకాకుండా దానిమ్మ లో అనేక రకాల ప్రయోజనాలు దని ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందా..

  • దానిమ్మ గింజలు, దానిమ్మ గింజల రసం గుండెకు మంచి టానిక్ లాంటిది.గుండె వ్యాధుల నివారణకు దానిమ్మ చాలా మంచిది అని చాలా సార్లు  రుజువయ్యింది .దానిమ్మలోని యాంటీ అక్సిడేట్లు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల గోడలపై కొవ్వు పెరుకుపోవాదాన్ని అడ్డుకుంటా యి.ఇది గుండెకు మాత్రమే కాకుండా కాలేయం ,మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది.
  • బీపీ ఉన్న పేషెంట్లకు దానిమ్మ దేవుడిచ్చ్జిన వరంగా చెప్పవచ్చు.దానిమ్మ శరీరంలోని సహజసిద్దమైన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.ధనిమ్మను తరుచు తీసుకోవడం వలన రక్త నాళాలు శుభ్రపడి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది.
  • దానిమ్మ పండు పై తొక్కను దంచి ,నీటిలో వేసి వేడి చేసి కషాయంగా చేసుకొని దానిలో తేనెను కలిపి తీ సుకోవడం వలన అసిడిటి నివారించవచ్చు.

see also :సోంపుతో ఇన్ని ప్రయోజనాలా..?

  • ధనిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.దీనిని తరుచు తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సీన్ లను బయటికీ పంపవచ్చు.
  • శరీరంలోని కొలెస్ట్రాలని నియంత్రిస్తుంది.దీనిని తరుచు తీసుకోవడం వల్ల శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాలను తగ్గించి శరీరానికి మంచిని చేసే గుడ్ కొలెస్ట్రాలను పెరిగే విధంగా దోహదపడుతుంది.

see also : చెరకు రసం త్రాగడం వలన కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే

  • మూత్ర సంబంధిత వ్యాధుల నివారణకు దానిమ్మ పెట్టింది పేరు.శరీరంలోని యునినరీ స్టిస్ట౦ను బాగుచేసి మూత్ర సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.అంతేకాకుండా దానిమ్మ రసాన్ని తీసుకోవడం వలన ముత్రశాయంలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతా యి .
  • దగ్గుతగ్గడానికి దానిమ్మ రసంలో అల్లం రసం ,తేనెను కలిపి ముడుపుటలు తీసుకోవడం వల్ల తగ్గుతుంది

see also :ద్రాక్ష పండు తింటే ఇన్ని ప్రయోజనాలా..?

  • దానిమ్మ ను తరుచు తీసుకోవడం వలన పురుషులలో విర్యకణాల సంఖ్యను పెంచుతుంది.దానిమ్మ ఆకుల కషాయాన్ని పుక్కిలించడం ద్వారా దంత సమస్యలను నివారించుకోవచ్చు.
  • చిన్న పిలలకు ,వృద్దులకు దానిమ్మ రసాన్ని ఇవ్వడం వల్ల మతిమరుపు తగ్గి జ్ఞాపక శక్తి పెరిగి,మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది.
  • దానిమ్మ తినడం వల్ల స్త్రీలకు నెలసరి సమయంలో ఎక్కువ బ్లిడింగ్ అవ్వకుండా నిరోధిస్తుంది.

see also :మామిడి పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat