రైతన్నల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన కృషి ఫలించింది. రాష్ట్రంలోని రైతుల శ్రేయస్సు కొరకు ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్ని కొద్దికాలం క్రితం మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు రాసిన లేఖకు ప్రతిస్పందన వచ్చింది. స్పైసెస్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ కొరకు ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు.
see also :ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్..!
పసుపు పంట మార్కెటింగ్, రీసెర్చీ ద్వారా పంట అభివృద్ది చేయాల్సిన భాద్యత కేంద్ర, రాష్ర్టాల వ్యవసాయ శాఖల పైన ఉంటుందని తనలేఖలో తెలిపిన కేంద్ర మంత్రి, స్పైసెస్ బోర్డు ద్వారా పసుపుతోపాటు ఇతర స్పైసెస్ ఎగుమతులు, నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణ వంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుందన్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ కోసం ప్రత్యేక సెల్ ను సైసెస్ బోర్డులో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకువస్తే ‘ట్రేడ్ ఇంఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీం (Trade Infrastructure for Export Scheme – TIES) పథకం కింద పసుపు కొరకు ప్రత్యేకంగా ఒక స్పైసెస్ పార్క్ కూడా నెలకొల్పుతామని ఆయన లేఖలో పేర్కొన్నారు.
see also :భవనాలు తప్పా ఒక్క ఉద్యోగం రాదు-జేసీ దివాకర్ రెడ్డి..!