కాంగ్రెస్ పార్టీ నేతలు నాశనం చేసిన తెలంగాణను ప్రజలు ఊహించని దానికంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు . మంత్రి కేటీఆర్‌పై జానారెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై మంత్రి ఇవాళ మీడియా ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను బూతులు తిడుతున్న కాంగ్రెస్ నేతలు.. సంస్కారం గురించి మాట్లాడడమేంటని ప్రశ్నించారు . మంత్రి కేటీఆర్ మాట్లాడిన దాంట్లో ఏ మాత్రం తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు . అసెంబ్లీలో వాడదగిన భాషనే.. కేటీఆర్ వాడినట్టు చెప్పారు. మంత్రి కేటీఆర్ చొరవతో గత మూడేళ్లలోనే తెలంగాణ రాష్ర్టానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.
see also : హ్యాట్సాఫ్ మహేష్..!
see also :2019 ఎన్నికలు : సీఎం ఎవరో తేల్చేసిన తాజా సర్వే..!!
కాంగ్రెస్ నేతలు.. ఏనాడైనా జానారెడ్డిని గౌరవించిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు . నల్లగొండ సభలో మీ నాయకులు మాట్లాడిన భాష ఏంటో తెలియదా? ఆ విషయంలో మీ నాయకులను ఎందుకు మందలించలేదని జానారెడ్డిని ప్రశ్నించారు. ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీపైన ప్రజలు కోపంతో ఉన్నరని చెప్పారు.కాంగ్రెస్‌ది మూడు స్కామ్‌లు, ఆరు కేసుల చరిత్రన్నారు. కాంగ్రెస్ హయాంలో చెరువులు నాశనమయ్యాయని చెప్పారు . టీ ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ఇచ్చిన హామీలతో పాటు కొత్త అభివృద్ధి పథకాలను చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు.