రూ.100 కోట్ల విలువైన మట్టి కొట్టేశాడు..! మంత్రి పుల్లన్న అవినీతి బాగోతం..!! అవును, మీరు చదివింది నిజమే. ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్తిపాడు నియోజకవర్గం కేంద్రంగా రూ.100 కోట్లు విలువైన మట్టిని అక్రమ మైనింగ్ చేశారు. మైనింగ్‌కు అడ్డు వచ్చిన అధికారులను బెదిరించి మరీ.. బెదిరింపులకు లొంగని వారికి లంచాలు ఇచ్చి మరీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తన అనుచర వర్గంతో ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మట్టిని ఇష్టానుసారం అక్రమమైనింగ్‌కు పాల్పడ్డాడు. సామాన్య ప్రజల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు మంత్రి పుల్లారావు బెదిరింపులు సహజమే. అయితే, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఇన్ని విమర్శలు చేసింది మరెవరో కాదు.. స్వయాన టీడీపీ మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు.
see also : మీరు సెంటర్ డిసైడ్ చేయండి..మేం చర్చకు సిద్ధం..వైఎస్ అవినాష్‌రెడ్డి
see also : వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి ..!
టీడీపీ మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్తిపాడు నియోజకవర్గం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు అత్తారిల్లయిపోయిందన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మంత్రి పుల్లారావు ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికే రూ.100 కో ట్ల మట్టిని మైనింగ్ చేసి కొట్టేశాడని, ఇంకా చెప్పుకుంటూ పోతూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అవినీతి బాగోతం చాలానే ఉందన్నారు.
see also : ఎవడండీ పవన్ కల్యాణ్..!?