ఇటీవల పులివెందులలో టీడీపీ నేతలు చేసిన సవాల్ పై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయంలో పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిని నిరూపించడానికి తాను సిద్దంగా ఉన్నానని..ఎప్పుడు ఏ సెంటర్లో చర్చకు రావాలో టీడీపీ నేతలు చెప్పాలని సూచించారు.
see also :మరో సారి వహ్వా అనిపించుకున్న మంత్రి హరీష్ రావు..!
see also :హైదరాబాద్కు వచ్చినందుకు మరో అమెరికన్ ఫిదా
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న చంద్రబాబు సర్కార్ సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.విద్యార్ధుల ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు వైఎస్ఆర్ హయంలోనివేనన్నారు .రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పూర్తిచేసిన పనులకు చంద్రబాబు సర్కార్ గేట్లు ఎత్తి అదంతా తమ క్రెడిట్ అని చెప్పుకోవడం సిగ్గుచేటు..అందుకే వారి సవాల్ ను స్వికరిస్తున్నా..బహిరంగ చర్చకు సెంటర్ అధికార టీడీపీ నేతలు డిసైడ్ చేస్తే…తాను రావడానికి సిద్ధంగా ఉన్నానని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.