తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతరవి తనయుడు అయిన పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరై నూతన వవధూవరులను ఆశీర్వదించారు .ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెంకటాపురం గ్రామాస్తులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి హాజరైన ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు.
పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరయ్యేందుకు విమానంలో ఆయన బేగంపేట నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు తదితరులు కేసీఆర్ కు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… నేను ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు పుట్టపర్తికి వచ్చాను , మళ్లీ ఇంతకాలానికి పుట్టపర్తికి వచ్చా అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. త్వరలో కుటుంబసమేతంగా పుట్టపర్తికి వస్తానని కేసీఆర్ అన్నారు . పుట్టపర్తి సమీపంలో ఉన్న బుక్కపట్నం చెరువు గురించి ఎమ్మెల్యే పల్లెను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది జిల్లాలో వర్షాలు ఎలా ఉన్నాయి? పంటల పరిస్థితి ఏంటని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు.