ప్రచారానికి ఒకింత దూరంగా ఉంటూ…ఫలితం వచ్చినప్పుడు దాన్ని పంచుకొని సంతోషపడే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు,రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఖాతాలో మరో ప్రత్యేకత చేరింది. దేశీయ, అంతర్జాతీయ దిగ్గజాలకు చెందిన కంపెనీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించారు కేటీఆర్. వైమానిక రంగానికి చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్ అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్లలో ప్రారంభమైంది. టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, టాటా సన్స్ ఎమరిటీస్ ఛైర్మన్ రతన్ టాటా, అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
see also :మరో సారి వహ్వా అనిపించుకున్న మంత్రి హరీష్ రావు..!
ఈ ప్రాజెక్టు దక్కడం వెనుక మంత్రి కేటీఆర్ కృషి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చునని ఆయన సన్నిహితులు అంటున్నారు. సుదీర్ఘకాలంగా టాటాలతో కేటీఆర్ జరిపిన జరిపిన చర్చల ఫలితంగానే మిగతా రాష్ర్టాలు పోటీ పడినప్పటికీ…హైదరాబాద్‌ను టాటాలు తమ గమ్యస్థానంగా ఎంచుకున్నారని వివరిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రథమస్థానంలో ఉండటం, ఇప్పటికే హైదరాబాద్ ఏరోస్పేస్‌కు సంబంధించిన పలు సంస్థలు తమ కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్న తీరును మంత్రి కేటీఆర్ నొక్కిచెప్తుంండటంతో పాటుగా టాటాల రథసారథి రతన్‌టాటాకు కేటీఆర్ ఇచ్చిన ప్రాధాన్యం కూడా కారణం అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన టీహబ్‌ను రతన్‌టాటాతోనే మంత్రి కేటీఆర్ ప్రారంభింపచేశారు. సంప్రదాయ వ్యాపారవేత్తగా విజయవంతంగా తనదైన ముద్ర వేసిన రతన్‌టాటా నూతన స్టార్టప్‌లను కూడా ప్రోత్సహించడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారని అందుకే ఆయనతో టీ హబ్ ప్రారంభిస్తున్నామని మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో తెలిపారు. ఇలా విధానాలు, ప్రత్యేకమైన చొరవ టాటా-బోయింగ్ ఏర్పాటుకు కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు.