వచ్చే ఎన్నికల్లో పార్టీ అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తా అని ప్రకటించారుకాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర నేటికి మూడో రోజుకి చేరుకుంది.ఇవాళ సంగారెడ్డి ,జహీరాబాద్,నారాయణఖేడ్లలో ఈ యాత్ర సాగింది.
see also :ఓ మై గాడ్.. జగన్ షాకింగ్.. ప్రజాసంకల్పయాత్రకు బ్రేక్..!
ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో జరిగిన సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..ఈ ఏడాది డిసెంబర్ లోనే సాధారణ ఎన్నికలు జరుగుతాయన్నారు.ఈ క్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎన్నికలకు సిద్దం కావాలని ..పార్టీ పటిష్టత పై దృష్టి పెట్టాలని అయన సూచించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులు పండించే పంటలకు మద్దతు ధర పెంచుతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సదాశివపేట మండలం బొబ్బిలిగామ గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు శ్రీశైలం కుటుంబాన్ని ఉత్తమ్ పరామర్శించారు.
see also :టీఆర్ఎస్ పార్టీ మళ్ళి అధికారంలోకి రావడం ఖాయం..మంత్రి తుమ్మల
see also :హైదరాబాద్ సిగలో మరో ప్రత్యేకత…టాటా బోయింగ్ కేంద్రం ప్రారంభం