తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రైతాంగానికి శుభవార్తను ప్రకటించారు.ఈ రోజు సోమవారం కరీంనగర్ లో జరుగుతున్న రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతాంగం అభివృద్ధి కోసం పలు పథకాలను అమలుచేస్తున్నాం.
రానున్న కాలంలో కోట్ల ఎకరాలకు సాగునీళ్ళు అందించాలనే లక్ష్యంతోనే ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేస్తున్నాం.రాష్ట్ర రైతాంగం భవిష్యత్తులో దేశ రైతాంగ సమస్యలను తీర్చే వారిగా నాయకత్వం వహించాలని కోరారు.ఈ క్రమంలో రాష్ట్రంలో రైతులు అకాల మరణం చెందితే ఐదు లక్షల రూపాయలను బీమాను కల్పిస్తాం.ఆ మొత్తాన్ని ప్రభుత్వమే ఇస్తుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు ..