రైతుపై మరోసారి దౌర్జన్యం జరిగింది. వెలగపూడికి చెందిన గద్దె మీరా ప్రసాద్ అనే రైతు తన పొలంలో రహదారి నిర్మాణం జరపడానికి వీల్లేదని అడ్డుకున్నందుకు పోలీసులు అతన్ని చొక్కా చిరిగేలా కొట్టారు. సాక్ష్యాత్తు సీఐ సుధాకర్‌బాబు రైతుపై చేయి చేసుకున్నాడు. అంతరం బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైతు సొమ్మసిల్లి పడిపోవడంతో పోలీసులు వెళ్లిపోయారు. తనకు అన్యాయం చేస్తే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని రైతు మీరా ప్రసాద్ హెచ్చరించారు. బాధిత రైతుకు మద్దతు తెలిపిన సీపీఐ, సీపీఎం నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధానికి ఇవ్వని పొలంలో రోడ్డు వెలా వేస్తారంటూ రైతు మీరా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు.
see also : అచ్చం ”మైకేల్ జాక్సన్‌లానే”.. అందుకే ఇలా జరిగింది..!?
see also : మోత్కుపల్లిపై చర్యలకు జంకుతున్న బాబు..కారణం ఇదే
తాత్కాలిక సచివాలయం వెనుక ఉన్న సీఆర్డీఏ నిర్మిస్తున్న ఎన్ 9 రహదారి నిర్మాణ పనులు నిలిపివేయాలని తన భూమిలో ఆ నిర్మాణం జరుగుతుందంటూ ఆ రైతు గతంలో హైకోర్టును ఆశ్రయించాడు. అయితే, సీఆర్డీఏ అధికారులు మాత్రం హైకోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కి పోలీసులను అడ్డం పెట్టుకుని రైతును భయ భ్రాంతులకు గురి చేశారు. సంఘటనా స్థలానికి వచ్చిన సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ విజయకుమారిని వివరణ కోరగా తాము భద్రత కోసమే పోలీసులను రప్పించామని చెప్పారు.