శ్రీదేవికి ఉన్న అతి జాగ్రత్త ఆమెను జీవితాంతం వేధిస్తూనే ఉంది. సాటి హీరోయిన్‌ల రాకతో పోటీ పెరిగి అందానికి మెరుగులు దిద్దడం నేర్చుకుంది. పళ్లు ఎత్తుగా ఉన్నాయని, ముక్కును సరిచేసేందుకు సర్జరీ ఇలా ప్రతీ దానికి వేరే వాళ్లతో పోటీ పెట్టుకుందా..? తనకు తానే తెలియకుండా ఒక మాయావళయంలో చిక్కుకుపోయిందా..? తెలుగు ఇండస్ర్టీలో ఉన్నంత కాలం కొత్తగా వచ్చిన హీరోయిన్లతో పోటీపడుతూనే ఉండేది. బాలీవుడ్‌కు వెళ్లిన తరువాత అదే పరిస్థితి. మొదట్లో రేఖ, ఆ తరువాత జయప్రద, ఆ తరువాత మాధురీ, ఇలా ప్రతీ ఒక్కరితో పోటీ పడుతూ.. అందానికి సర్జరీ చేయించుకుంటూ ఇబ్బందులు పడుతూనే ఉంది.
see also : పీకే ఫ్యాన్స్ “మైండ్ లెస్ ఫెలోస్ “.వాళ్ళ వల్ల పీకే పొలిటికల్ లైఫ్ స్మాష్ ..
శ్రీదేవి జీవితానికి, పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ జీవితానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే టైప్ మెంటాలిటీ ఉన్న వాళ్లు కాలంతోపాటు వచ్చే మార్పులను స్వాగతించలేని వాళ్లు. మొఖంపై చిన్న మడత వస్తే చాలు తట్టుకోలేని వీళ్లిద్దరూ జీవితాంతం సర్జీలతో కాలం గడిపారు. స్లిమ్ గా ఉండటం కోసం అన్నం మానేసి టాబ్లేట్‌లతోనే కాలం గడిపారు. మైకేల్ జాక్సన్ మృతదేహాన్ని పోస్టుమార్టం చేసిన రిపోర్టులో ఏముందో తెలుసా..? ఆయన కడుపులో అరిగీ అరగని విటమిన్ టాబ్లేట్‌లు చాలానే ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఏదో సాధించాలనే అతి తపన. ఆ తపనతో సరిగ్గా తిన్నామా..? పడుకున్నామా..? అని చూడకుండా పరుగులు పెట్టాడు మైకేల్ జాక్సన్. చివరకు ఓ రాత్రి గుండెపోటుతో మరణించాడు.
see also : “నాకది”లేదు..అందుకే నేను ఒంటరి…తేల్చేసిన సల్మాన్ ..
ఇప్పుడు శ్రీదేవి కూడా అంతే, రీసెంట్‌గా వారం రోజుల క్రితం ఓ ఫంక్షన్‌కు వచ్చింది. అందులో ఆమెను చూసిన వాళ్లంతా షాక్ అయ్యారు. చాలా సన్నగా, పీలగా ఉంది. అలా ఉండటాన్ని శ్రీదేవి అందం అనుకుంది. చూసిన వాళ్లంతా ఏదో జరుగుతుందనుకున్నారు. అలా మనసులో అనుకున్నది మరిచిపోయేలోపే మనల్నందర్నీ విడిచి శ్రీదేవి వెళ్లిపోయింది. రామ్‌గోపాల్ వర్మ చెప్పినట్లు శ్రీదేవి అనే అందం వెలుగును చాలా మంది కళ్లల్లో, గుండెల్లో ఆర్పేసి పట్టుకుపోయాడు దేవుడు.
ఇంకా చిన్నపిల్లలా కనిపించాలనే అత్యాశ, ఆతృతతో తన వయసుతోపాటు వచ్చే మార్పులను శ్రీదేవి ఆహ్వానించలేకపోయింది. ఫలితం అతిలోక సౌందర్యం ఓ అర్థరాత్రి అనంతలోకాలకు వెడలిపోయింది.