ఔను. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ ఇది. పార్టీ జెండా పీకేయ్యాలనే సంచలన వ్యాఖ్యలు చేసినప్పటికీ సదరు నాయకుడిపై చర్య తీసుకునేందుకు…పార్టీ అధినేత అయిన చంద్రబాబు జంకుతున్నారు. ఆయనపై క్రమశిక్షణ వేటు వేస్తే..తన సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందో అని వణికిపోతున్నారు. ఇంతకీ బాబును ఆ స్థాయిలో వణికిస్తున్న నాయకుడు ఎవరంటే..టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు
see also : సీఎం కేసీఆర్ షాకింగ్ నిర్ణయం …
see also :ఈ ఘనత వందేళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకే దక్కింది …!
సాక్షాత్తు ఎన్టీఆర్ సమాధి సాక్షిగా మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం బలపడే చాన్సే లేదని పేర్కొంటూ పార్టీని విలీనం చేసేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాజకీయాల్లో ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. మోత్కుపల్లి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారన్న అభిప్రాయానికి వచ్చిన టీ-టీడీపీ నేతలు జరిగిన పరిణామాలపై పూర్తి సమాచారాన్ని అధ్యక్షుడు చంద్రబాబుకు నివేదిక ద్వారా అందించారు. తగు చర్యల కోసం ఎదురుచూశారు. అయితే మోత్కుపల్లి విషయం టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
see also : శ్రీదేవి గురించి ఈ విషయం మీకు తెలుసా ..!
సహజంగా ఇలాంటి వాటి విషయంలో చంద్రబాబు చటుక్కున్న స్పందించేస్తుంటారు అనే పేరుంది. అలాంటి వ్యక్తి మోత్కుపల్లిపై చర్యల విషయంలో వెనకడుగు వెనుక అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. మోత్కుపల్లిపై చర్యలు తీసుకోలేకపోవడానికి బాబు రాజకీయ జీవితం, నిర్ణయాలే కారణమని అంటున్నారు. 33 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ అనుభవంలో దళిత నాయకుడిగా వెలుగు వెలిగిన మోత్కుపల్లి టీడీపీలో ఉండటం వల్ల నేడు ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఊరించి ఆశలు రేపిన గవర్నర్ గిరీ విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆ పదవి ఇక రాదని మోత్కుపల్లికి అర్థమై `అమరావతిలో మంచి ఇల్లు కేటాయిస్తే అడే ఉండిపోతా` అని మొరపెట్టుకున్నా…టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నుంచి స్పందన రాలేదు. దీంతో మోత్కుపల్లి తన ఆవేదనను ఈ రూపంలో వెళ్లగక్కారని అంటున్నారు.
see also : శ్రీదేవి మరణం వెనుక.. దాగిన నిజాలెన్నో.. బోనీకపూర్ చెప్పని సంచలనాలు ఇవే..!
ఒకవేళ టీడీపీ అధినేత చంద్రబాబు ఎంట్రీ ఇచ్చి మోత్కుపల్లిపై చర్యలకు సిద్ధమైతే…అది రచ్చ రచ్చ అవుతుందని పలువురు జోస్యం చెప్తున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సమయంలో ఎన్టీఆర్ వర్గంలో ఉన్న మోత్కుపల్లి నర్సింహులు బాబు తాలుకూ కుట్రలన్నీ తెలుసునని…ఇప్పుడు మోత్కుపల్లిపై ఆయన చర్యలు తీసుకుంటే… ఆ నాటి కుట్రల కథలన్నీ ఆయన బయటపెడతారని అంటున్నారు. అందుకే బాబు కిమ్మనకుండా ఉండిపోయారని పలువురు పేర్కొంటున్నారు. అందుకే పార్టీని మూసేయాలని మోత్కుపల్లి ప్రకటించినప్పటికీ బాబు చర్యలు తీసుకోలేకపోతున్నారని వివరిస్తున్నారు.