వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం అందర్నీ విషాదంలో ముంచెత్తింది. బాలనటిగా నాలుగేళ్ల వయసులోనే వెండితెర ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి.. అతిలోక సుందరి వరకూ తన అందచందాలతో నటించి, మెప్పించి ఇండియన్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన భర్త బోనీకపూర్ బంధువు వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి-24న ఆదివారం తెల్లవారు జామున గుండెపోటుతో మరణించారు.
see also : శ్రీదేవి గురించి ఈ విషయం మీకు తెలుసా ..!
వెండితెర పై తన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకున్న శ్రీదేవి పలు అవార్డులు కూడా అందుకున్నారు. నటనకు ఆమె చేసిన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2013లో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది. ఇక శ్రీదేవి తన సినీ కెరీర్‌లో 14 సార్లు ఫిలింఫేర్‌కు నామినేట్ కాగా, నాలుగు సార్లు ఉత్తమనటిగా, రెండుసార్లు స్పెషల్ జ్యూరీ లభించాయి. ఇందులో తెలుగులో ఆమె నటించిన క్షణక్షణం చిత్రానికి ఉత్తమ నటిగా నంది అందుకున్నారు. అంతేకాకుండా ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానెల్ సీఎన్‌ఎన్-ఐబీఎన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ఇన్ 100 ఇయర్స్‌గా శ్రీదేవి ఎంపికయ్యారు.
see also :సీఎం కేసీఆర్ షాకింగ్ నిర్ణయం …
ఇక శ్రీదేవి జీవితంలో కూడా అనేక ఆటుపోట్లు ఉన్నాయి. శ్రీదేవి పర్సనల్ విషయానికి వస్తే.. శ్రీదేవి-బోనీకపూర్ జంటను బాలీవుడ్‌లో ఆదర్శ జంటగా చెప్పుకుంటారు. బోనీకపూర్‌కు ఇది రెండో పెళ్లయితే… శ్రీదేవి సైతం బోనీ చేయి అందుకోక ముందు నటుడు మిధున్ చక్రవర్తిని రహస్య వివాహం చేసుకుందని, అయితే ఆ తర్వాత విడిపోయిందని ఆరోజుల్లో పెద్ద రూమర్ ఉంది. అయితే అప్పటికే మిధున్ చక్రవర్తికి యోగిత అనే మహిళతో పెళ్లి అయిందని.. ఆ తర్వాత ఏమైందో ఏమోగాని మిధున్ చక్రవర్తికి బాగా దగ్గరైన శ్రీదేవి 1985లో ఆయనను పెళ్లి చేసుకుందని, అయితే ఆ వివాహం కూడా ఎంతో కాలం నిలబడలేదని శ్రీదేవి-మిధున్‌ల బంధం 1988లోనే తెగతెంపులైందని అంటారు.
see also :రైతు బాగుపడిన రోజే నిజమైన పండుగ.. సీఎం కేసీఆర్
అయితే మిధున్-శ్రీదేవిల బంధానికి బలమైన అధారాలు లేనప్పటికీ, అప్పట్లో కొన్ని కథనాలు మాత్రం ఈ వార్తలకు అప్పట్లో బలం చేకూర్చాయి. మిధున్ సైతం తమ వివాహ సర్టిఫెకెట్ చూపించాడని కొద్ది మంది మీడియా మిత్రులు చెప్పినట్టు సమాచారం. ఇక ఈ ఇద్దరి వివాహ వార్త తెలియడంతో యోగిత ఆత్మహత్యా యత్నం చేసిందని… శ్రీదేవిని రెండో భార్యగా మిధున్ తెచ్చుకుంటే తనకు అభ్యంతరం లేదని ఇంటర్వ్యూలో చెప్పడం అప్పట్లో ఆ వార్త పెద్ద సంచలనమే సృష్టించింది. యితే యోగితను విడిచిపెట్టేందుకు సిద్ధమేనని మొదట్లో చెప్పిన మిధున్ ఆ తర్వాత వెనకడుగు వేయడంతో శ్రీదేవి 1988లో ఆయనతో తెగతెంపులు చేసుకుందని నాటి సమాచారం. ఇక అప్పటికే శ్రీదేవి పై తిరుగులేని ఇష్టాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన బోనీకపూర్‌కు శ్రీదేవి దగ్గరకావడం పెళ్ళి చేసుకోవడం జరిగింది. బోనీని పెళ్లిచేసుకున్న 7 నెలల తర్వాత 1997 జనవరిలో శ్రీదేవీ ప్రకటించడం గమనార్హం.