ప్రముఖ సినీ నటి అతిలోక సుందరి శ్రీదేవి హఠాత్ మరణంతో సినీ ప్రపంచం శోఖసంద్రంలో మునిగిపోయింది. దుబయ్‌లోని ఓ పెళ్లి వేడుకకు హాజరైన శ్రీదేవి.. వేడుక మధ్యలోనే తీవ్రమైన గుండెపోటు రావడంతో ఒక్కసారిగి కుప్పకూలిపోయారు. దీంతో కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయారని.. బోని కపూర్ సోదరుడు సంజయ్ కపూర్ తెలియజేశారు. శనివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
ఇక శ్రీదేవి 1963 ఆగష్టు 13న తమిళనాడులోని శివకాశిలో జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మా యాంగేర్ అయ్యపాన్. శ్రీదేవి తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి.. సినీ చరిత్రలో కొన్ని పేజీలను లిఖించుకున్నారు. 1975 సంవత్సరంలో అతి చిన్నవయసులోనే లో తునాయివన్ అనే సినిమాతో సినీ రంగంలోకి ప్రేవేశించింది శ్రీదేవి. భారతదేశంలో గొప్ప నటీమణుల్లో ఒకరిగా ఎదిగిన శ్రీదేవి… తెలుగులో నటించిన తొలి చిత్రం మా నాన్న నిర్దోషి. తెలుగు తెర పై అగ్రహీరోలందరితోనూ ఆడిపాడిన శ్రీదేవి.. అతిలోకసుందరిగా ఓ వెలుగు వెలిగారు. తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో 72, మళయాళంలో 26, కన్నడంలో 6 చిత్రాల్లో శ్రీదేవి నటించారు. ఇక ఆమె నటించిన చివరి చిత్రం మామ్.. ఈ చిత్రం 2017లో విడుదల అయ్యింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని సర్వత్రా ప్రార్ధిస్తున్నారు.