ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసు మరుగున పడిపోయిందని భావిస్తున్న వేళ హఠాత్తుగా ఏ4 నిందితుడు జరూసలేం మత్తయ్య సుప్రీం చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. తాను అప్రూవర్‌గా మారుతానని సుప్రీం ఛీప్ జస్టిస్‌కు జరూసలేం మత్తయ్య రాసిన లేఖలో పేర్కొన్నాడు. అంతేకాకుండా, జరూసలేం మత్తయ్య రాసిన లేఖలో పలు కీలక అంశాలను ప్రస్థావించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను చంపాలని చూస్తున్నాడని, తనకు ప్రాణహాని ఉందని, నేను వ్యక్తిగతంగా కోర్టుకు చెప్పుకోవాల్సింది చాలా ఉందన్నారు.
see also : వైఎస్ జగన్‌వి ఊరపంది ఆలోచనలు..!!
see also : చంద్రబాబు జీవితచరిత్ర ఆధారంగా బయోపిక్ …టీజర్ విడుదల …!
చాలా విషయాలు బయటకు రాకుండా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు అనుచరవర్గం నన్ను హత్య చేసేందుకు యత్నిస్తున్నారని, ఈ నేపథ్యంలో కోర్టు ముందు పలు విషయాలను వ్యక్తిగతంగా చెప్పుకునేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. అలాగే, ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పగించాలన్నారు. ఇలా జరూసలేం మత్తయ్య సుప్రీం చీఫ్ జస్టిస్ ఓటుకు నోటు కేసుకు సంబంధించి లేఖ రాయడంతో టీడీపీ వర్గాలు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యాయి. అయితే, ప్రత్యేక హోదా అంశాన్ని వదిలేసి ప్యాకేజీ విషయంలో మోడీ సర్కార్‌పై విమర్శలు చేస్తున్న టీడీపీకి ఏ4 మత్తయ్య రాసిన లేఖ టీడీపీ నేతలతోపాటు.. ఓటుకు నోటు కేసులో మిగిలిన నిందితులకు కూడా దడపుట్టించే అంశమే.