ఈ ఏడాది మార్చి 31 నాటికి అన్ని గ్రామాలకు మంచినీళ్లు చేరాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. గ్రామాలకు పైపులైన్లు వేసుకుంటూనే సమాంతరంగా గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణ పనులు కూడా చేపట్టాలని సీఎం చెప్పారు. గ్రామాల్లో అంతర్గత పైపులైన్లు నిర్మించి, ఇంటింటికీ నల్లాలు బిగించి మంచినీళ్లు సరఫరా చేసే విషయంలో ఎమ్మెల్యేలు చొరవ చూపాలని సీఎం కోరారు.
see also :మంత్రి కేటీఆర్ పై మహిళా పారిశ్రామికవేత్త ప్రశంస
మార్చి చివరి నాటికి ఓ.ఆర్.ఆర్. లోపలి గ్రామాలన్నింటిలో ఇంటింటికీ మంచినీరు సరఫరా చేయాలని మిషన్ భగీరథపై ప్రగతి భవన్ లో శుక్రవారం సీఎం సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి శ్రీ ఎస్.కె. జోషి, ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, శ్రీమతి స్మితా సభర్వాల్, మిషన్ భగీరథ అధికారులు, వర్కింగ్ ఏజన్సీల ప్రతినిథులు పాల్గొన్నారు.