తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు దేశ విదేశీ ప్రతినిధులు సైతం అబ్బురపడుతున్నారు. విదేశాల్లో ఉన్న ప్రాజెక్టుల స్థాయిలో సేవలు అందిస్తాయని ఆకాంక్షిస్తున్నారు.బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తాజాగా యునెస్కో ఆధ్వర్యంలో చేపడుతున్న పథకంతో పోల్చారు.
see also :ఈ నెల 26న కరీంనగర్ కు సీఎం కేసీఆర్.. !
see also :వైఎస్ జగన్ పాదయాత్ర కోసం ఏ రాష్ట్రం నుండి వచ్చారో తెలుసా..?
బాలి దేశంలో ‘సుబక్ వాటర్ ఇరిగేషన్ సిస్టం’ పేరుతో యునెస్కో పనిచేస్తోంది. తాజాగా ఆ దేశాన్ని సందర్శించిన ఆండ్రూ ఇటీవలి తన కాళేశ్వరం పర్యటనను గుర్తుచేసుకున్నారు. ‘బాలిలో యునెస్కో ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాల ద్వారా ఎలాంటి చక్కని ఫలితాలు అందుతున్నాయో..అదే రీతిలో తెలంగాణలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌తో కూడా అలాంటి అద్భుతమైన ఫలితాలు అందుతాయి’ అని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి మంత్రి కేటీఆర్ మరో ట్వీట్‌లో స్పందిస్తూ ‘ఆండ్రూ మీరు కాళేశ్వరంను సందర్శించినందుకు సంతోషకరం. ఆ ప్రాజెక్టు ప్రత్యేకతను మీరు గుర్తించినందుకు చాలా ఆనందదాయకం’ అని కృతజ్ఞతలు తెలిపారు.