Home / POLITICS / వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను గెలిపించేది ఏమిటంటే..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను గెలిపించేది ఏమిటంటే..!

తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాలు సృష్టిస్తున్న రాజ‌కీయ హ‌డావుడి నేప‌థ్యంలో…ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వ‌చ్చేసింది. ఎవ‌రికి వారు తాము అధికార టీఆర్ఎస్ పార్టీకి గ‌ట్టిపోటి ఇస్తామ‌ని, ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌ద్దె దించుతామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటున్నారు. అయితే ఈ ప‌రిణామాన్ని రాజ‌కీయ‌వ‌ర్గాలు తేలిక‌గా కొట్టిపారేస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధి అజెండాగా కొన‌సాగుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార‌థ్యంలోని స‌ర్కారే తిరిగి అధికారంలోకి రానుంద‌ని, ముఖ్య‌మంత్రిగా మళ్లీ కేసీఆర్ ప‌గ్గాలు చేప‌డుతార‌ని విశ్లేషిస్తున్నారు.

see also :టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై …

see also :చంద్ర‌బాబుకు మిగిలేది బోడిగుండే.. మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

త‌మ ధీమాకు గ‌ల కార‌ణాల‌ను కూడా ఈ సంద‌ర్భంగా వారు వివ‌రిస్తున్నారు. ఒక‌వైపు ఇప్ప‌టికే ఉన్న‌ సంక్షేమ ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తూ మ‌రోవైపు అనేక విప్ల‌వాత్మ‌క సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్రవేశ‌పెట్టిన ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ చ‌రిత్ర‌లో నిలుస్తార‌ని అంటున్నారు. పశువుల కాపరులు అంటే తేలిక‌గా చూసే పరిస్థితి నుంచి వారు త‌లెత్తుకొని తిరిగేలా గొర్రెల పెంప‌కాన్ని కేసీఆర్ తీసుకువ‌చ్చార‌ని వివ‌రిస్తున్నారు. జీవాల పెంప‌కాన్ని జీవిత ఆదాయంగా నిరూపించార‌ని అంటున్నారు. కీల‌క‌మైన బీసీ వ‌ర్గాల సంక్షేమం కోసం ప‌థ‌కాలు ఆయా వ‌ర్గాల‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భాగ‌స్వామ్యంతో తీర్చిదిద్దార‌ని గుర్తుచేస్తున్నారు.

see also :ఏపీ మాజీ సీఎస్ కు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు ..ఆ దేవుడే దిక్కా ..!

see also :ఇలాగైతే జ‌గ‌నే సీఎం.. తేల్చి చెప్పిన చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌..!!

ఇక క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీముబార‌క్‌, స‌న్న‌బియ్యం, పించ‌న్లు, డ‌బుల్ బెడ్రూం ఇండ్లు, గురుకుల పాఠ‌శాల‌లు, కేసీఆర్ కిట్‌, నూత‌న ప్రాజెక్టులతో పంట పొలాలు ప‌చ్చందం సంత‌రించుకున్న తీరు, ఒంటరి మ‌హిళ‌ల‌కు పించ‌న్లు స‌హా మ‌రెన్నో ప‌థ‌కాలు ప్ర‌జ‌ల హృద‌యాల్లో  చిర‌స్థాయిగా నిలిచాయ‌ని అంటున్నారు. అన్నింటికీ మించి విశ్వ‌స‌నీయ‌త గ‌ల నాయ‌కుడిగా కేసీఆర్‌కు ఉన్న పేరు, రాష్ట్ర సాధ‌న కోసం ఆయ‌న చేసిన పోరాటం అభివృద్ధి కోసం ప‌డుతున్న త‌ప‌న ఖ‌చ్చితంగా మ‌రోమారు విపక్షాల‌కు చేదు అనుభ‌వం మిగులుస్తుంద‌ని చెప్తున్నారు.

see also :హ్యాట్సాఫ్ రోజా ..!! చలసాని శ్రీ‌నివాస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

see also:వరంగల్‌లో 250 పడకల కేన్సర్‌ ఆస్పత్రి..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat