ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు మిగిలేది బోడిగుండేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ మిత్రపక్షం బీజేపీ మంత్రి మాణిక్యాలరావు. ఏపీలో బీజేపీ వెంట్రుకలాంటిదని, ఒకవేళ మాకు నష్టం జరిగితే వెంట్రుకమాత్రమే పోతుంది.. కానీ టీడీపీకి మాత్రం బోడిగుండే మిగులుతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి మాణిక్యాలరావు.
see also : టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై …
see also : ఎల్లో గ్యాంగ్ మైండ్ బ్లాక్ అయ్యేలా షేర్లు చేయండి..!
అయితే, 2014 ఎన్నికల్లో జాతీయ పార్టీ బీజేపీతో కలిసి టీడీపీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అలాగే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వీరికి మద్దతు ఇచ్చారు. వీరు ముగ్గురు కలిసి ఎన్నికల ప్రచారం చేసినప్పటికీ వైసీపీపై కేవలం 2 శాతం ఓట్లతో టీడీపీ అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఏపీలో టీడీపీ సర్కార్‌పై వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. పూర్తిస్థాయి అవినీతిలో చంద్రబాబు ప్రభుత్వం కూరుకుపోవడంతో ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఓటమి తప్పదని సంకేతాలిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
see also : అవినీతి చేసుకోమని చంద్రబాబు నాయుడు చెప్పడనే వీడియో హల్ చల్
see also : ఏపీ మాజీ సీఎస్ కు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు ..ఆ దేవుడే దిక్కా ..!
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా ఎద్ద నష్టమేమీ లేదు. ఎందుకంటే బీజేపీకి ఏపీలో ఉండేదే 4 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లే. ఎలాగో కేంద్రంలో బీజేపీ ఉంది. కాబట్టి ఏపీలో బీజేపీకి ఉండాల్సిన స్థాయి ఉంటుందని, ఈ నేపథ్యంలో టీడీపీ బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే చిక్కొచ్చేది చంద్రబాబు సర్కార్కేనని రాజకీయ విశ్లేషకుల మాట.