ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొట్టిన ఒకే ఒక దెబ్బకు రాష్ట్రంలో అధికార మిత్రపక్షాలైన తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన కకావికలయ్యాయి. తెలుగుదేశం నాయకులు ఏమి చెప్పాలో, జగన్ తెచ్చిపెట్టిన ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక పిసుక్కుని చేస్తున్నారు. ఈరోజు టీవీ చర్చల్లో పాల్గొన్న తెలుగుదేశం ప్రతినిధులు ముఖాల్లో నెత్తురు చుక్క లేకుండా, ఎలా జవాబివ్వాలో, పార్టీనిఎలా సమర్ధించుకోవాలో తెలియని అయోమయస్థితిలోకి వెళ్లారని వారి వాదనలు, వదనాలు చూస్తే స్పష్టం అవుతున్నది. నిజానికి జగన్ ఇంత తెగిస్తాడని వారు ఊహించలేదు. కేసులు ఉన్నాయి కాబట్టి బీజేపీని ఎదిరించే ధైర్యం చెయ్యడు అని భావించారు. పవన్ తన అవివేకపు పైత్యంతో జగన్ ను రెచ్చగొట్టడం వారి కొంప ముంచింది.
see also : కమల్ హాసన్ పై మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్
తీరా జగన్ యుద్ధానికి సిద్ధం అనగానే తెలుగుదేశం శ్రేణులు మొత్తం శిఖండులై పోయారు. ఈరోజు ఒక టీవీలో చర్చల్లో పాల్గొన్న అనూరాధ, జూపూడి ప్రభాకర రావు అడ్డగోలు మాటలతో అడ్డంగా బుక్కైపోయారు. ఇక జూపూడికి చిన్నప్పుడు చదివిన ఆవు వ్యాసం బాగా వంటబట్టినట్లుంది. ఎప్పుడో రెండేళ్లక్రితం తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్ ఎందుకు చెయ్యలేదు? రాష్ట్రపతి ఎన్నికలకు ఎందుకు మద్దతు ఇచ్చారు? లాంటి పాత చింతకాయ పచ్చడి వాదనతో నవ్వుల పాలయ్యారు. అంటే జూపూడి అప్డేట్ అయి రెండేళ్లకు పైగానే అయినట్లుంది! ప్రపంచంలో తనకన్నా పార్లమెంటరీ రూల్స్ తెలిసినవాడు లేదన్నట్లు ఆయన వాదన హాస్యాస్పదంగా ఉన్నది. ఇప్పటి జగన్ సవాలు ను గూర్చి మాట్లాడకుండా ఎప్పటివో పాతవిషయాలు తవ్వడం జూపూడి అవివేకానికి నిదర్శనం. ఇంతకూ నలభై ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబు జగన్ సవాలుకు దీటుగా స్పందిస్తాడా లేదా అనేది ఆయన చెప్పలేకపోతున్నారు.
see also : రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలి..కేటీఆర్
పైగా తెలుగుదేశం ఎంపీలు రాజీనామా చేస్తే పార్లమెంట్ లో పోరాడేది ఎవరు? అని నిలదీస్తున్నారు. మరి ఆ సూత్రం వైసిపికి వర్తించదా? దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం తోక ముడిచేసిందని అందరకు అర్ధం అవుతున్నది. కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాల్సిన తరుణంలో అస్త్రసన్యాసం చేసి తెలుగుదేశం సాధించేది ఏమిటి? కేసుల భయం తప్ప మరొకటి ఉన్నదా? ఏమైనా ఒకటిమాత్రం నిజం. ప్రస్తుత సమయంలో వైసిపి దూకుడు ప్రజలను ఆకట్టుకున్నది. జగన్ లో ఒక కథానాయకుడిని ప్రజలు చూస్తున్నారు. ఉత్తరకుమారుడిలా పారిపోతున్న చంద్రబాబును ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు.
see also : వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు ..టికెట్ ఖరారు చేసిన జగన్ …!
కుటిల రాజకీయాలు నడపడం తప్ప నేరుగా ప్రత్యర్థిని ఢీకొనే సాహసం చంద్రబాబుకు లేదు అని ఈ తరానికి విస్పష్టంగా గోచరమయింది. బహుశా ఈ పిరికితనానికి రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం భారీమూల్యం చెల్లించవలసి రావచ్చు.జగన్ సాధించిన ఘనవిజయం ఇది. ఈ ఉదంతంతో పవన్ కళ్యాణ్ కు ఉన్న పరువు పూర్తిగా మంటగలిసిపోయింది. ప్రజలముందు తలెత్తుకోలేని పరిస్థితి తెచ్చింది. పవన్ సరసన చేరి చంద్రబాబును గుడ్డిగా సమర్ధించిన జయప్రకాశ్ ప్రతిష్ట కూడా ఆవిరైపోయింది. చెదపురుగు పట్టిన టేకుచెక్కలా తయారైన జయప్రకాశ్ ను చూస్తే జాలివేస్తుంది. మొత్తానికి జగన్ కొట్టిన ఉండేలు దెబ్బకు పిల్లకాకులన్నీ చెల్లాచెదురై పోయాయి! -Written By ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఇలపావులూరి మురళీ మోహన రావుగారు ..
see also :‘అ!’ మూవీలో ఉన్న సెన్షేషన్ ఏంటో తెలియాలంటే.. కచ్ఛితంగా ఇది చూడాల్సిందే..!