ఆంధ్రప్రదేశ్ లో అక్రమ సంబంధాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. నేరాలు సంఖ్య విపరితంగా పెరుగుతంది. మరి ఎక్కువగా కర్నూల్ జిల్లాలో నేరాలు జరుగుతున్నాయి. హత్యలు,దోపిడిలు, రేప్ లు ,అక్రమ సంబంధాలు ఇలా అన్ని నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త.. ప్రియుడు అనుకుని కన్నకొడుకుపైనే గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లా బేతంచెర్ల మండలంలోని గుత్‌పల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన సోమన్న రామలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని సోమన్న అనుమానిస్తుండేవాడు. దీంతో దంపతులకు తరుచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో తెల్లవారుజామున పీకల దాకా మద్యం సేవించిన సోమన్న ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో తన భార్య ప్రియుడు ఇంట్లో ఉన్నాడని భావించి బెడ్‌పై పడుకుని ఉన్న పెద్ద కొడుకు పరుశురామ్(14)పై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో పరుశురామ్‌కు తీవ్ర గాయాలవడంతో బేతంచెర్లకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడుని కర్నూలుకు తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సోమన్నపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.