ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్లలో నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ అంటే తన దృష్టిలో ఓ పోరాట యోధుడని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కారం చేసిన వ్యక్తి జగన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా పెట్టిన కేసుల్లో వైఎస్ జగన్ నేరస్థుడు కాదని, కేంద్ర, రాష్ట్ర కేసులన్నీ కుట్రపూరితమైనవేనన్నారు.
see also : జూనియర్ ఎన్టీఆర్కు రెండో సంతానం..!
see also : సినీ గాయని కౌసల్య..శోభనం రోజు రాత్రి భర్త ఇంత దారుణం చేశాడ..!