ఆంధ్ర ప్రదేశ్ విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఏపీ ప్రజలు మొత్తం కోరుతున్నా రు. ఇటివల జరిగిన బడ్జేట్ లో కూడ కేంద్రం ప్రవేశ పెట్టకపోవడంతో ఏపీ ఉద్యమంలా..ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతున్నది. ఢిల్లీలో కూడ ఆ వేడి ని వైసీపీ పార్టమెంటు సభ్యులు దర్నాలు చేశారు. అంతేగాక ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ ఆధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రత్యేకహోదా కోసం గత నాలుగెళ్ల నుండి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాడు. తాజాగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న వైసీపీ ఏంపీలతో రాజీనామాలు చేయిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఏపీ ప్రజల్లో మరింత బలం వచ్చింది. ఇకపోతే 5 కోట్ల ఆంధ్రలు ప్రత్యేకహోదా ఆడుగుతుంటే వారికి అండగా నిలవాల్సిన టీడీపీ నేత మాటలు హల్ చల్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని, కేవలం ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే వస్తుందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఆ మాటలు అన్నారు. దీంతో ఏపీలో ఉద్యమం ఎలా మారుతుందో చూడలి.
