సోషల్ మీడియా లో ఫేస్బుక్ కు ఉన్న ప్రాధాన్యత అంత ఇంత కాదు .ఉదయం లేచిన దగ్గర నుండి కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోకుండా ఫేస్బుక్ ను ఓపెన్ చేసి స్టేటస్ అప్ లోడ్ చేస్తున్నారు అంటే ఎంతగా ఫేస్బుక్ నేటి రోజుల్లో దైనందిన జీవితంలో భాగమైంది .
ఫేస్బుక్ వినియోగదారులు తమ ఖాతాలను మరింత భద్రంగా కాపాడుకునేందుకు, గుర్తింపును స్పష్టంగా పరిశీలించేందుకు ఫేస్‌బుక్ యాజమాన్యం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది .దీనిలో భాగంగా ఫేస్బుక్ ‘‘ఖాతా రికవరీ ప్రక్రియ సమయంలో సదరు ఖాతా యజమాని అధికారిక గుర్తింపును సత్వరం పసిగట్టేలా కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నాం.
ఇప్పటికే యూజర్లు లాగిన్ అయి వినియోగిస్తున్న డివైజ్‌లలో మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది. వినియోగదారులు తమ ఖాతా నిర్వహణను మరింత సురక్షితంగా ఉంచుకునేందుకు ఇది మరో ముందడుగు.. ’’ అని ఫేస్‌బుక్ వెల్లడించినట్టు ప్రముఖ టెక్నాలజీ పోర్టల్ టెక్‌క్రంచ్ తెల్పింది . తాజాగా వినియోగదారుల ముఖాలు గుర్తించేలా ఒక వీడియో చాట్ డివైజ్ దిశగా కూడా ఫేస్‌బుక్ ప్రయత్నాలు మమ్మురం చేసింది .