ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ముచ్చెమటలు పడుతున్నాయి. దానికి కారణం మీరు ఊహించిందే..! అదే ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రనే. అయితే, వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను ఆరు నెలలపాటు కడప నుంచి ఇచ్చాపురం వరకు మూడువేల కిలోమీటర్లు నడిచేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ప్రజాదరణపై తన మంత్రుల వద్ద ఆరా తీసినట్లు సమాచారం. అంతేకాకుండా అధికార కార్యక్రమాలన్నింటిని పక్కనపెట్టి మరీ టీవీలల్లో ప్రసారమవుతున్న వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రను ఓ పదిహేను నిమిషాలు చూశాడని టీడీపీ నాయకుల సమాచారం. అందులో భాగంగానే బయటకు వచ్చిన ఫోటోనే.. పైనున్న ఫోటో.