కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఎంపీలు జితేందర్ రెడ్డి,రాజీవ్ శర్మ ఉన్నారు. ఎయిమ్స్ నిర్మాణానికి వెంటనే నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు. వెనుకబడిన జిల్లాలలకు 2017-18సంవత్సరానికి నిధుల మంజూరుకు జైట్లీ హామీ ఇచ్చారు. సమావేశం బాగా జరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు.
see also : కేసీఆర్జీ..మీకు పెద్ద అభిమాని..! కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి
రాష్ట్రములో వెనకబడిన ప్రాంతాలకు విభజన చట్టంలో ఉన్నట్టు కేంద్రం సహాయం చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. 2014 నుంచి 2017 వరకు మూడు ఆర్ధిక సంవత్సరాలకు 450 కోట్ల చొప్పున మొత్తం 1350 కోట్లు విడుదల చేశారు. 2017- 2018 కి ఆర్ధిక సంవత్సరానికి నిధులు రాలేదని తెలిపారు. వెంటనే నిధులు విడుదల చేయాలని అరుణ్ జైట్లీకి ఇచ్చిన నివేదికలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని పాత 10 జిల్లాల్లోని 9 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించినందుకు అరుణ్ జైట్లీకి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.