ఏపీ లో అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .నిన్న టీడీపీ పార్టీ మాజీ ఎంపీ చిమటా సాంబు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు .
తాజాగా ఆ పార్టీకి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు వైసీపీ పార్టీలోకి రావడానికి సిద్ధమయ్యారు అని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన వర్గానికి చెందిన మీడియా వర్గాలు ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది . మాజీ మంత్రి అయిన రావెలకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున టిక్కెట్ ఇవ్వకూడదు అని ఆ పార్టీ జాతీయ అధిష్టానం డిసైడ్ అయ్యింది అంట .
ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీలో చేరేందుకు ఇప్పటికే చర్చలు పూర్తయినట్టు కూడా ఆ మీడియా తెల్పింది. రావెల ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన ఒంగోలు ఎంపీ, జగన్ బాబాయ్ వైవి.సుబ్బారెడ్డితో చర్చలు కూడా జరిపారన్న విషయం ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా చంద్రబాబుకు కూడా తెలిసింది అంట .ఏది ఏమైనా మాజీ మంత్రి రావేలా త్వరలోనే వైసీపీ లో చేరడం ఖాయం అన్నమాట..