2019 సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీలో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు.. నంద్యాల ఉప ఎన్నికల తర్వాత తనకు అత్యంత నమ్మకమైన ఒక ఏజెన్సీ ద్వారా చంద్రబాబు సర్వే చేయించుకున్నారని ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ప్రచురించింది. అయితే ఈ సర్వే రిపోర్ట్ చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 106 మంది టీడీపీ పార్టీ ఎమ్మెల్యేల్లో కేవలం 43 మంది మాత్రమే తిరిగి విజయం సాధించే అవకాశాలున్నట్టు సదరు సర్వే సంస్థ తేల్చిచెప్పినట్టు పత్రిక ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇక అత్యధిక స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఘోర పరాజయాన్ని చవిచూడకతప్పదని సర్వే సంస్థ నివేదించింది. ఓడిపోయే అవకాశం ఉన్న 63 సిట్టింగ్ స్థానాల్లో భారీగా అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించాల్సిందిగా చంద్రబాబుకు సదరు సంస్థ రికమెండ్ చేసింది. లేకుంటే 63 స్థానాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. రాయలసీమలో ప్రతిపక్ష పార్టీని దెబ్బతీయాలంటే.. రెడ్డి సామాజికవర్గం నేతలకు గాలం వేయాలని.. ఆ సర్వే సిఫార్సు చేసిందని అందులో భాగంగానే.. మైదుకూరుకు చెందిన డీఎల్‌ను టీడీపీలోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉందని తెలుస్తోంది. అయితే డిఎల్ నుండి స్పష్టమైన సఖేతాలు రాలేదని సమాచారం. అంతే కాకుండా ఇప్పుడున్న కేబినేట్‌తో సహా తెలుగు 70 శాతం తెలుగు తమ్ముళ్ళ పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని కూడా తేల్చిందంట ఆ సర్వే. దీంతో త్వరలోనే కేబినెట్‌ను కూడా మరోసారి మార్చొచ్చని టీడీపీ వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఇక ఇటీవల జరిగిన నంద్యాల గెలుపు నమూనా.. అంటే వందల కోట్లు ఖర్చు పెట్టడం సాధ్యమయ్యే పనికాదని.. అందుకే ఇతర విషయాలపైనా చంద్రబాబు ఫోకస్ పెడుతున్నారని తెలుస్తోంది. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో టీడీపీపై ఉన్న ప్రజావ్యతిరేకతను తప్పించుకునేందుకు ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి 70 శాతం మంది కొత్తవారికే అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మేజారిటీ సభ్యులు ఓటమి అంచున ఉన్నారని సర్వే రిపోర్ట్ రావడం టీడీపీలో పెద్ద దుమారమే రేగింది.