బాలీవుడ్ బాక్సాఫీస్ క్వీన్ కంగన రనౌత్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, దర్శకుడు కరణ్ జోహార్‌తో మాటల యుద్ధం మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచిన కంగనా.. తాజాగా పలువురు హీరోలతో తనకు ఉన్న శారీరక సంబంధాలను బయటపెట్టడం సంచలనం రేపుతున్నది. పరిశ్రమలో స్టార్లతో నటించేటప్పడు వారితో సన్నిహితంగా మెలుగడం, ప్రేమలో పడటం సహజం. ఒకవేళ అలాంటి వాటిని ఎదురిస్తే షూటింగ్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అలా అని తోటి హీరోతో పడక పంచుకొంటే ఇక వారి పరిస్థితి ఎంత దుర్భరమో చెప్పలేం. పరిశ్రమలో ఇలాంటి పరిస్థితుల నాకే కాదు అందరికి ఎదురవుతాయి అని కంగన బోల్డ్‌గా సమాధానం చెప్పింది.
గతంలో హృతిక్ రోషన్‌తో ప్రేమాయణం, ఆ తర్వాత ఈ-మెయిల్స్ వ్యవహారం రచ్చకెక్కడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి వివరిస్తూ.. తన వైవాహిక జీవితం సంక్షోభంలో పడింది అని హృతిక్ రోషన్ తనతో గోడు వెళ్లబోసుకున్నారు. నా భార్యకు నాకు దూరం పెరిగింది. మేము వేర్వేరు పడక గదిలో పడుకొంటున్నాం అని హృతిక్ కంటతడి పెట్టాడు. దాంతో నేను ఆయన వలలో పడ్డాను అని కంగన తెలిపింది. తన భార్య కొట్టేదని.. సుశానే ఓ దెయ్యం అని.. హృతిక్ రోషన్ చెప్పిన మాటలకు నేను షాక్ తిన్నాను. అప్పుడు నేను యవ్వనంలో ఉన్నాను. దాంతో ఆయన ప్రేమలో పడ్డానని.. ఆ తర్వాత మోసపోయానని అర్ధమైందని కంగన వెల్లడించింది. ఇక ఆదిత్య పంచోలి గురించి షాకింగ్ విషయాలను వెల్లడించింది. నాకు 17 ఏళ్ల సమయంలో ఆదిత్య పంచోలి నన్ను లైంగికంగా వేధించాడు. నన్ను శారీరకంగా వాడుకొన్నారు. ఆర్థికంగా నేను కష్టాల్లో ఉన్నప్పుడు అతడికి లొంగిపోవాల్సి వచ్చింది. గత్యంతరం లేని పరిస్థితిలో తలవొగ్గాను అని కంగన చెప్పింది.