తెలంగాణ రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ మహానగరంలో నూతనంగా ఏర్పాటు చేయనున్నబస్టాపులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ఉన్న బస్టాపుల కన్నా అత్యుత్తమ డిజైన్లు ,సౌకర్యాలతో కొత్తవాటిని ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఇప్పటికే టెండర్లు పూర్తి చేసిందని అన్నారు .
see also : టాప్ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్..మంత్రి కేటీఆర్
నగరంలో సుమారు 800కు పైగా కొత్త బస్టాపులు ఏర్పడనున్నాయని అధికారులు మంత్రికి తెలియజేశారు. వాటిలో ఉన్న సౌకర్యాల ప్రకారం ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించి నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, అన్ని సౌకర్యాలున్న ఏ గ్రేడ్ బస్టాపుల సంఖ్యను మరింత పెంచాలని మంత్రి జీహెచ్‌ఎంసీ కమిషనర్ కు అదేశాలు జారీ చేశారు.
see also : రాజకీయాలను షేక్ చేస్తున్న జగన్ తాజా ట్వీట్…
ఎట్టి పరిస్థితుల్లో మార్చి మాసాంతానికి బస్టాపుల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. రోడ్డును అనుకొని ఉన్న ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల అధికారులతో చర్చించి అయా ప్రాంతాల్లో బస్సు బేలను ఏర్పాటు చేయాలన్నారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని లేకుంటే కాంట్రాక్టు రద్దు చేసేందుకు వెనకాడబోమని మంత్రి వర్కింగ్ ఎజెన్సీలకు మంత్రి తెలిపారు.