తెలంగాణ రాష్ట్ర వికలాంగుల వసతి గృహాలలో సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మెన్ వాసుదేవ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవికలాంగుల వసతి గృహాలలో రాత్రి పూట నిద్ర కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి కరీంనగర్ లోని వికలాంగుల వసతి గృహంలో నిద్ర చేశారు. ఇవాళ ఉదయం కరీంనగర్ జిల్లాలోని వికలాంగుల కార్పొరేషన్ స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..
కరీంనగర్ పట్టణంలోని వికలాంగులకు సంబంధించిన ట్రైనింగ్ కం ప్రొడక్షన్ సెంటర్ కి కరీంనగర్ నగరంలో BSNL ఆఫీస్ దగ్గర 20 గుంటల స్వంత స్థలం ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ 10కోట్లు ఉంటుందన్నారు .ఆ స్థలంలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో బిల్డింగ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని వారికి హామీ ఇచ్చారు.హాస్టల్స్ లో ఉన్న సమస్యలను,వికలాంగులు ఎదుర్కొంటున్నా ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి సమగ్రామైన రిపోర్ట్ తయారు చేసి నివేదిక రూపంలో తీసుకెళ్లి ఇస్తామన్నారు .రాష్ట్ర వికాలంగుల చైర్మన్ ఆయన తరువాత వికాలంగుల సంస్థ కు అదనపు బడ్జెట్ క్రింద రూ. 33కోట్లు తీసుకొచ్చానని తెలిపారు..సీఎం కేసీఆర్ దివ్యాంగులకు పూర్తిగా అండగా ఉన్నారని అన్నారు .దివ్యాంగులకు ఉద్యోగ రిజర్వేషన్ 4,%, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 5% డబుల్ బెడ్ ప్రభుత్వ పథకాల్లో 5% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం దివ్యంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.