తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం సికింద్రాబాద్ పరిధిలోని హౌసింగ్ బోర్డు స్థలంలో… మడ్‌పోర్ట్‌లోని గాంధీనగర్ బస్తీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లకు మంత్రులు మహమూబ్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే డబుడ్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు స్లమ్‌లలో నివసించే ప్రజలు ముందుకు వస్తే హైదరాబాద్ నగరంలో ఎన్నిఇళ్లయినా కట్టిస్తామన్నారు.మురికి వాడలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం అన్నారు.
see also :ఆ ఒక్కటే కేటీఆర్ ట్విట్టర్ రికార్డుకు కారణం ..!
మారేడ్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో రూ. 41 కోట్లతో 536 ఇండ్ల నిర్మాణం అదేవిధంగా సిఖ్‌విలేజ్ మడ్పోర్ట్ గాంధీనగర్‌లో రూ. 15 కోట్లతో 176 ఇండ్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టిందన్నారు.పేద ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు . కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్నట్లు చెప్పారు .
see also :ఎంపీ కవితపై పవన్ ఆసక్తికరమైన ట్వీట్..!
కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ పథకం.. ఈ పథకం పేరుతో కేవలం రూ. 70 వేలు ఇచ్చారని అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కో ఇంటిపై రూ. 8 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.కంటోన్మెంట్ ఆస్పత్రిని తమకు అప్పగిస్తే అభివృద్ధి చేస్తమన్నారు. పూణె తరహాలో ఇక్కడ ఆర్మ్‌డ్‌ఫోర్స్ మెడికల్ కాలేజీ వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్.ఈ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సాయన్న, ఎంపీ మల్లారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Dy CM Mahmood Ali and MA&UD Minister @KTRTRS laid foundation stone for construction of 2 BHK houses for the poor at Sri Ram Nagar, Secunderabad today. The government will construct 260 houses at a cost of 28.52 crores. pic.twitter.com/gSLhYjNhz7
— Min IT, Telangana (@MinIT_Telangana) February 10, 2018
Minister @KTRTRS addressing the gathering after foundation stone laying ceremony for 2BHK houses at Sri Ramnagar, Secunderabad. pic.twitter.com/qnlzBfREt3
— Min IT, Telangana (@MinIT_Telangana) February 10, 2018
Dy CM Mahmood Ali & Minister @KTRTRS laid foundation stone for construction of 2BHK dignity houses at Old Marredpally today. The government will construct 536 2BHK houses within one year at a cost of 41.54 crores. pic.twitter.com/XJTg10M3SL
— Min IT, Telangana (@MinIT_Telangana) February 10, 2018
Minister @KTRTRS addressing the gathering after foundation stone laying ceremony for 2BHK houses at Old Marredpally, Secunderabad. pic.twitter.com/dLjzhGwMTs
— Min IT, Telangana (@MinIT_Telangana) February 10, 2018