సేంద్రియ వ్యవసాయంతో పండించిన బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు దాతర్ పల్లి గ్రామస్తులు గురువారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో అందజేశారు.సేంద్రియ వ్యవసాయం తో పండించిన బియ్యం ఆరోగ్యానికి ఎంతో మంచిదని మంత్రి అన్నారు.అంతే కాకుండ సేంద్రియ వ్యవసాయం తక్కువ ఖర్చుతోఅధిక దిగుబడి ఉంటుందన్నారు.గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వెల్ మండలం దాతర్ పల్లి గ్రామంలో సేంద్రియవ్యవసాయ విధానంలో పండించిన బియ్యాన్ని మంత్రి హరీష్ రావుకు మంత్రి నివాసంలో అందజేశారు.ఈ సందర్భంగా సేంద్రియ వ్యవసాయ చేసే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని హరీశ్ రావు ప్రకటించారు. సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు ఉన్నాయని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయంలో పండించిన కూరగాయలు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని తెలిపారు.సిద్ధిపేట నియోజకవర్గంలో దాదాపు 10గ్రామాలు సేంద్రియ వ్యవసాయం చేస్తు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలను రైతు బజార్ లలో ప్రత్యేక స్టాల్స్ పెట్టనున్నట్టు చెప్పారు. సేంద్రియ వ్యవసాయం చేసే గ్రామాలకు,రైతులకు సహకారం అందిస్తాం అని మంత్రి తెలిపారు.
see also : ప్రజా సమస్యలపై బైక్ పై డివిజన్ లో సందర్శించిన మేయర్ నరేందర్..!
see also : ఢిల్లీకి వెళ్లిన మంత్రి కేటీఆర్
see also : రేవంత్ రెడ్డి తమ్ముడిని రోడ్డ్ పై ఉరికించిన వృద్దులు.. !