తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు వస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు.
తాజాగా మహాబుబాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య ఈ రోజు బుధవారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ గూటికి చేరారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు భద్రయ్యకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలే కాకుండా ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా ఆకర్షితులవుతున్నారు.అందుకే బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించడానికి ముందుకు వస్తున్నారు అని మంత్రి హరీష్ రావు అన్నారు .అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్న తీరుకు ఆకర్షితుడ్ని అయి పార్టీ మారుతున్నాను అని ఆయన అన్నారు ..