Home / TELANGANA / హైదరాబాద్‌లో మరో ప్రముఖ సదస్సు..!

హైదరాబాద్‌లో మరో ప్రముఖ సదస్సు..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం మరో ప్రముఖ సదస్సుకు వేదిక కాబోతున్నది. మైనింగ్ టూడే కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరగనున్నది. ఈ అంతర్జాతీయ కాన్ఫరెన్సు మరియు ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో మైనింగ్ ఇంజనీర్స్ అసోషియేషన్ అప్ ఇండియా ( MEIA), ఫిక్కి కలిసి నిర్వహిస్తున్నారు. టెక్నాలజీ, ఎక్విప్ మెంట్, మేషినరీ, పాలసీ మరియు ఒవర్ సీస్ ( TEMPO) థీమ్ తో ఈ సమావేశం జరుగుతున్నది. హైటెక్స్ లో ఈ నెల 14 నుంచి 17 వరకు ఈ కార్యక్రమం జరగుతుంది. దేశ అర్దిక ప్రగతిని బలోపేతం చేసేందుకు మైనింగ్ ఒక కీలకమైన అంశం అని, పవర్, సిమెంట్, ఏరోస్పేస్, ఢిఫెన్స్, అయిల్ మరియు గ్యాస్ వంటి రంగాలను ప్రభావితం చేసే పలు అంశాలను ఈ సదస్సులో చర్చించనున్నారు.

నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ఖనిజాల అన్వేషణలో వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఝాన మార్పులపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరగనున్నది. మైనింగ్ సాంకేతిక పరిజ్ఝాన అంశంలో గనుల గుర్తింపులో రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ల వినియోగం, గనులకు రేటింగ్ ఇవ్వడం, గనుల పర్యవేక్షణ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఝానాలపైన వివిధ దేశాల నుంచి వచ్చే నిపుణులు చర్చిస్తారు. దీంతోపాటు మైనింగ్ పాలసీలు, వాతావరణం, మైనింగ్ రంగంలోని అవకాశాలు, సాంకేతిక పరిజ్ఝాణ బదిలీ వంటి అంశాలపైన ఈ సదస్సులో చర్చించడంతోపాటు అయా అంశాలకు సంబందించిన నూతన ప్రొడక్టుల అవిష్కరణ జరపనున్నారు. ముఖ్యంగా ఇసుక ప్రొక్యూర్ మెంట్ విధానాల అధ్యాయనంలో భాగంగా బీచ్ సాండ్స్, రివర్ సాండ్స్, క్రష్డ్ స్టోన్ సాండ్( రాతి ఇసుక) వంటి అంశాలను ప్రత్యేకంగా చర్చిస్తారు. మైనింగ్ రంగంలోని పెట్టుబడులు అవకాశాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ర్ర్టంలోని అవకాశాలు, మైనింగ్ అనుబంధం రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపైన ఈ సమావేశంలో ఒక చర్చకార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఈ సమావేశాలకు అమెరికా, కెనడా, అస్ర్టేలియా, ఆసియా, అఫ్రికాలోని దేశ విదేశాల నుంచి ప్రతనిధులు హజరవుతారు. ఈ ప్రతినిధులు చర్చల్లో పాల్గోనడంతోపాటు, అయా దేశాలకు చెందిన మైనింగ్ మరియు అనుబంద కంపెనీలు వారి వారి ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. ఈ మైనింగ్ టూడే కార్యక్రమ ప్రారంభోత్సవానికి రాష్ర్ట గవర్నర్ ఈయస్ యల్ నర్సింహాన్, కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లు హజరవుతారు. ఈమేరకు మంత్రి కేటీఆర్ గవర్నర్ ను కలిసి అహ్వానం అందజేశారు.

మైనింగ్ శాఖాధికారుల డైరీని అవిష్కరించిన మంత్రి కేటీఆర్

గనుల శాఖాధికారుల 2018 డైరీని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో అవిష్కరించారు. డైరెక్టర్ అప్ మైన్స్ సుశీల్ కూమార్ అద్యర్యంలో మైన్స్ అండ్ జియాలజీ శాఖాధికారుల సంఘం రాష్ర్ట నాయకులు ఈ డైరీ అవిష్కరణ కార్యక్రమంలో పాల్గోన్నారు. గనుల శాఖాధికారులు సంఘానికి మంత్రి కేటీఆర్ ఈ  సందర్భంగా అభినందనలు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat