బుల్లితెరతో పాటు వెండితెరపై రాణిస్తున్న అందాల భామ అనసూయ ట్విట్టర్‌కి గుడ్ బై చెప్పడం సెన్సేషన్‌గా మారింది. తన పర్సనల్ విషయాలతో పాటు ప్రాజెక్ట్స్ విషయాలను ఎప్పటికప్పుడు నెటిజన్స్‌తో షేర్ చేసుకునే అనసూయ ఫేస్ బుక్, ట్విట్టర్ నుండి బయటకి వచ్చేసిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. యాంకర్ అనసూయ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసింది. మంగళవారం ఓ మహిళ, అనసూయ తమ ఫోన్ పగలగొట్టిందంటూ ఫిర్యాదు చేయటంలో సోషల్ మీడియాలో అనసూయపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
జరిగిన సంఘటన విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు అనసూయ ప్రయత్నించినా.. నెటిజెన్లు శాంతించలేదు. దీంతో మనస్థాపం చెందిన అనసూయ తన సోషల్ మీడియా అంకౌట్లు డిలీట్ చేసింది. ట్వీటర్‌తో పాటు ఫేస్ బుక్‌లో కూడా అనసూయ అకౌంట్ కనిపించటం లేదు. నెటిజెన్ల నుంచి విమర్శలు రావటం వల్లే అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
see also..స్టార్ హీరోతో అనసూయ ఎఫైర్..! ఫోటోలతో సహా బయటపెట్టిన ఆరేళ్ల బాలుడు..!!