ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి ,ప్రస్తుత ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఈ రోజు బుధవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే.గాలి మృతిపై టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతీ మీడియాతో మాట్లాడుతూ ఆయన మరణించారనే వార్తను విని షాక్ కు గురయ్యాను .
See Also:మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు మృతికి అసలు కారణం ఇదేనా..?
ఆయన ఎంతో ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా రాజకీయాల్లో ఉన్నంతవరకు బ్రతికారు.గతంలో చంద్రబాబు చేస్తోన్న నీచ రాజకీయాలను చూసి భరించలేక కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే గా గెలిచారు.అది ఆయన సత్తా ..ఆయనకు ఉన్న ప్రజల్లో ఆదరణ .అప్పట్లో చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేస్తున్న కానీ తన గెలుపుకు ఆయన ఎంతో సహకరించారు.గాలి టీడీపీలోనే పుట్టి టీడీపీలోనే మరణించారు .అది ఆయన గొప్పతనం.గొప్ప రాజకీయ నేతగా రాణించాలంటే గాలిని ఆదర్శంగా తీసుకోవాలి .
see also : గాలి ముద్దుకృష్ణమనాయుడు గురించి మీకు తెలియని విషయాలు
ప్రస్తుతం కొంతమంది వలన రాష్ట్రంలో రాజకీయాలు భ్రస్టు పట్టాయి .ఇలాంటి నేతలు లేకపోతే ఇంకా ఏమైపోతాయో అని భయమేస్తుందని ఆమె అన్నారు .కిమ్స్ లో ఆయన పార్థివ దేహాన్ని ఆమె సందర్శించి నివాళులు అర్పించారు.ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.
see also : దట్ ఈజ్ వైఎస్ఆర్ : వైఎస్ జగన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త..!!