ప్రజల కోసం ఏమైనా చేసే మనస్తత్వం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిది. అంతేకాదు. ప్రజల సంక్షేమం కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఉంచిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్, 108, ఇలా అనేక పథకాలే.. వైఎస్ఆర్‌ను ముఖ్యమంత్రిని చేశాయి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను మేనిఫెస్టోలో పెట్టిన పథకాల ఫలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతీ ఒక్కరికి అందేలా అమలు చేసి చూపించారు కూడా.
అయితే, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పథకాల్లో ఆరోగ్య శ్రీ ప్రజలకు మరింత దగ్గరైంది. ప్రజలు వారి సంపాదనలో సగ భాగం ఆరోగ్య ఖర్చులకు పోతున్న తరుణంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్య శ్రీతో ఆదుకున్నారు. ఈ పథకం అప్పట్లో దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. ఇప్పటికీ ఆరోగ్య శ్రీ
పథకాన్ని తెలుగు రాష్ట్రాల్లో (పేరు మార్చి) అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక అసలు విషయానికొస్తే దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుపరిచిన ఆరోగ్య శ్రీ పథకాన్ని ఏకంగా మోడీ సర్కారే కాపీ కొట్టింది. ఇప్పుడు ఈ విషయాన్ని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే, ఇటీవల పార్లమెంట్‌లో మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నేషనల్ హెల్త్ స్కీమ్‌ను అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పథకానికి నేషనల్ హెల్త్ స్కీమ్ అని, లేదా మోడీ హెల్త్ స్కీమ్ అని పేరు పెట్టి.. ఆ పథకానికి ఆధ్యుడు మాత్రం మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఈ విషయాన్ని ఏ చిన్న పిల్లాడ్ని అడిగినా చెబుతాడు.