ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ,ఎంపీలలో కొంతమంది ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశచూపించిన తాయిలాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే.అందులోభాగంగా మొత్తం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు.అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలలో బాబు వ్యవహార శైలిలో వచ్చిన మార్పుతో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది.తమకు ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయిన..ప్రజల్లో మద్దతు లేకపోయిన కానీ కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి షరిశ్మాతో గెలిచి టీడీపీలో చేరి చాలా తప్పు చేశామని వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
See Also:బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్‌కు చిరంజీవి రాజీనామా..!!
ఈ క్రమంలో వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జయరాములు బాబు వ్యవహారం మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.అయిన నేను తెలుగుదేశం పార్టీలో లేనా? ఆ పార్టీ ఎమ్మెల్యేను కాదా అని బద్వేలు శాసనసభ్యుడు జయరాములు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.అయన స్థానిక ఆర్ అండ్ బీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ “వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గెలిచి కేవలం నియోజక వర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరాను.కానీ పార్టీలో చేరిన దగ్గర నుండి ఇప్పటివరకు ఎమ్మెల్యే అయిన నాకు కనీస మర్యాద లేదు.
See Also:వైసీపీ అధినేత సంచలన నిర్ణయం ..ప్రతి తెలుగోడు కాలర్ ఎగరేసే వార్త..
అధికార పార్టీలో ఉన్న కానీ చిన్న చితక పని కూడా అవ్వడంలేదు.నియోజకవర్గం పేరుకే ఎస్సీ నియోజకవర్గం.కానీ ఎస్సీలను టీడీపీలో ఉన్న ఉన్నత సామాజిక వర్గం పైకి రానివ్వకుండా తొక్కుతుంది.నియోజక వర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినట్లు అన్ని పనులను చూసుకుంటూ నాతొ పార్టీ మారిన వాళ్ళను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నారు.వైసీపీలో పార్టీలోనే అన్ని వర్గాలకు సమన్యాయం ఉంది.టీడీపీలో ఆ ఒరవడి లేదు ..పార్టీ మార్పుపై నియోజక వర్గ ప్రజలతో ..కార్యకర్తలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాను అని ఆయన అన్నారు .ఎమ్మెల్యే వెంట పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కొంకుల రాంబాబు, ఇతర నేతలు వెంకటసుబ్బారెడ్డి, రాజీవ్‌బాష, రాజగోపాల్, రమణయ్య, శ్రీనివాసులవర్మ ఉన్నారు .
See Also:లగడపాటి సర్వేలో భూమా అఖిల ప్రియ గెలిసిందా..?..ఓడిపోయిందా…?