ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.దాదాపు రెండున్నర నెలలుగా చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.పాదయాత్రలో భాగంగా రైతులు,మహిళలు ,ఉద్యోగులు ,నిరుద్యోగులు ,వృద్ధులు జగన్మోహన్ రెడ్డిను కల్సి తమ బాధలను చెప్పుకుంటున్నారు.తాజాగా యావత్తు తెలుగు జాతి కాలర్ ఎగరేసుకునే సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.
See Also:వైసీపీలో చేరిక గురించి ఆలోచిస్తా..వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే…
అప్పట్లో భారతదేశంలో భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుకు ప్రధాన కారణమైన అమరజీవి పొట్టి శ్రీరాములు వలన ఏపీ ఏర్పడిందని మనందరికీ తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో జగన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నవంబర్ ఒకటో తారీఖున నిర్వహిస్తామని తెలిపారు.
See Also:బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్‌కు చిరంజీవి రాజీనామా..!!
అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రాంతం మీద ఉన్న అక్కసుతో ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ 2 న ఏపీ అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అయితే అప్పట్లో ఈ వ్యవహారం మీద రాజకీయ విశ్లేషకులు ,ప్రతిపక్షాలు ,పౌరహక్కుల సంఘాలు మహానుభావుడి త్యాగాల వలన ఏర్పాటైన రోజున జరపకుండా..ఏపీ ప్రజల్లో విభజన ఆవేదనను రాజేస్తూ సెంటిమెంట్ ను వాడుకోవాలని .. తెలంగాణ ప్రాంతం మీద ,తెలంగాణ ప్రజలు మీద ఉన్న అక్కసుతో జూన్ 2 న నిర్వహించడం ఏమిటి అని విమర్శలు కూడా గుప్పించారు.తాజాగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మహానీయుడు పొట్టి శ్రీరాముల త్యాగాన్ని గుర్తుపెట్టుకోవడమే కాకుండా చరిత్రను కాపాడుకునే అవకాశం ఉంటుందని సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది ..
See Also:లగడపాటి సర్వేలో భూమా అఖిల ప్రియ గెలిసిందా..?..ఓడిపోయిందా…?