అవును, పెళ్లి కాకుండానే.. యువుతులు తల్లులయ్యారు. ఈ సంఘటన గ్రీస్ దేశంలో చోటు చేసుకుంది.
ఆత్మ. ఈ మాట ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి నోట వింటూనే ఉంటాం. వారు చేసిన పాప పుణ్యాలను బట్టి మృతి చెందిన తరువాత తమ తమ దేహాలను వదిలి ఆత్మలుగా మారి స్వర్గానికో.. నరకానికో వెళతారని పెద్దలు చెబుతుండటం మనం వింటూనే ఉంటాం. అలాగే, ఏదైనా ప్రమాదంలో చనిపోయిన వారు మాత్రం.. వారికి తీరని కోర్కెలు ఉంటేమాత్రం.. ప్రజల మధ్యన తిరుగుతూనే ఉంటారు.
ఇక అసలు విషయానికొస్తే.. గ్రీస్ దేశంలోని ఓ ప్రాంతంలో.. ఓ వ్యక్తి ఆత్మ యువతులను తల్లులను చేసింది. ఈ విషయం స్వయాన పోలీసులే నిర్ధారించారు. అయితే, 1940లో చోటు చేసుకున్న ఈ ఘటనను ఓ రచయిత ఇటీవలే వెలుగులోకి తెచ్చాడు.
రాత్రి ఏడుగంటల సమయంలో తన ప్రియుడు నెల రోజులుగా కనిపించడం లేదంటూ స్టెల్లా అనే మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు ఆ యువకుడికి సంబంధించి సమాచారన్ని స్టెల్లా నుంచి రాబట్టారు. స్టెల్లా పోలీసులకు సమాధానమిస్తూ.. అతని పేరు స్టీఫెన్ హంగ్, ఆర్మీలో పనిచేస్తుంటాడు. గత రెండు సంవత్సరాలుగా మేం ప్రేమించుకుంటున్నాం.. అయితే, గత రెండు రోజుల నుంచి అతనికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదంటూ పోలీసులకు స్టీఫెన్ హంగ్ ఫోటోను ఇచ్చింది. పోలీసులు ఆ ఫోటోన చూసి ఆశ్చర్యాన్ని వ్యక్త పరిచారు. అందులో షాడో తప్ప మరేమీ లేదు. ఖంగు తినడం స్టెల్లా వంతైంది. అంతకు ముందు ఆ ఫోటోలో స్టీఫెన్ హంగ్ చిత్రం ఉందని, అయితే, పోలీసులకు ఇచ్చిన తరువాత ఫోటోలో చిత్రం కనిపించకపోవడంత స్టెల్లా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక పోలీసులు చేసేది లేక.. స్టెలా ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
స్టీఫెన్ హంగ్ ఆర్మీలో పనిచేస్తున్నట్లు స్టెల్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఎన్‌క్వైరీ చేశారు పోలీసులు. ఆర్మీలో స్టీఫెన్ హంగ్ అన్న పేరుతో ఎవరైనా ఉన్నారా..? అని ఆరా తీయగా.. ఆర్మీలో అలాంటి పేరుతో ఎవరూ లేరని తేలింది. అంతే కాకుండా.. మరో ఐదు పోలీస్ స్టేషన్లలోనూ ఇటువంటి తరహా కేసులే నమోదవడంతో పోలీసులకు ఈ కేసు విచారణ మరింత కఠినంగా మారింది. దీంతో ఈ కేసుల విచారణ కోసం ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు పోలీసు ఉన్నతాధికారులు.
పోలీసుల దర్యాప్తులో భాగంగా ఇలా యువతులను ప్రేమించి.. గర్భవతులను చేసింది రెండు నెలల క్రితం చనిపోయిన రాబర్ట్‌గా పోలీసులు గుర్తించారు. రాబర్ట్ తన జీవితంలో కనిపించిన ప్రతీ అమ్మాయిపై కన్నేశేవాడని, అమ్మాయిలను ఆకర్షించి గర్భవతులను చేసేవాడని పోలీసులు వెల్లడించారు. ఇలా అనుకోని ప్రమాదంలో రాబర్ట్ చనిపోవడంతో ఆత్మై తిరుగుతూ.. ఏదో ఒక వ్యక్తిలో చేరి ఆడవారిని తన ప్రతిభతో లోబర్చుకుని గర్భవతులను చేసేవాడు. ఇలా ఒక్కొక్క వ్యక్తిలో చేరి యువతులపై తన కామ వాంఛనను తీర్చుకున్నాడు. దీంతో పోలీసులు చేసేది లేక.. కొన్ని రోజుల తరువాత కేసును క్లోజ్ చేశారు.