కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు.. ఎన్నికలకు అస్సలు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాగా, శనివారం జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నేనేమనుకుంటున్నానంటే.. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి.. ఎన్నికల కోసమే పనిచేసినప్పుడు ఫలితాలు కాదు కదా..! భవిష్యత్తులో కూడా ప్రజలు నమ్మరన్నారు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడా అమలు కాని వినూత్న కార్యక్రమాలను ఏపీలో అమలు పరుస్తున్నామన్నారు. ఇక ఎలెక్షన్ అంటారా..? మమ్మల్ని ప్రజలే అన్ని సీట్లలో గెలిపిస్తారు. ఒకటి రెండు సీట్లు గెలిపించకుంటే. ఎందుకు గెలిపించలేదో ప్రజలే ఆలోచించుకోవాలి. అరెరే తప్పు చేశామని ప్రజలే సిగ్గుపడాలి అంటూ 2019 ఎన్నికలపై సంచలన కామెంట్లు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
