వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రని నెల్లూరు జిల్లాలో దుమ్మురేపుతున్నారు. శుక్రవారం కోర్టుకు హాజరు కావడం కోసం తన పాదయాత్రకు చిన్న బ్రేక్ ఇచ్చిన జగన్ శనివారం యధావిధిగా ప్రారంభించారు. ఇక 78వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్రలో భాగంగా రైతుల కోసం మరో సంచలన హామీ ఇచ్చారు జగన్.
ఇప్పటికే తను ప్రకటించిన నవరత్నాల హామీలతో పాటు.. మరిన్ని అంశాలను పాదయాత్రతో జనంలోకి తీసుకెళ్తున్న జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా ఇచ్చిన హామీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జగన్ మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వస్తే.. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని సరికొత్త హామీని తెరపైకి తేవడంతో రైతన్నలు హార్షిస్తుండగా.. టీడీపీ బ్యాచ్ మాత్రం ఇలాంటి ఆలోచనలు మాకెందుకు రావంటూ తలలుగోక్కుంటున్నారు.
ఇక నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం మరుపూరు శివార్ల నుంచి జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. శనివారం సాయంత్రం సౌత్ మోపూరు వద్ద ప్రజాసంకల్పయాత్ర ముగుస్తోందని వైసీపీ ప్రకటించింది. ఇప్పటి వరకూ పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల దూరానికి పైనే నడిచారు జగన్ మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి నేతలను చేర్చుకోవడానికి కూడా జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. కొంతకాలం కిందట పార్టీకి దూరం అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాదయాత్రలో జగన్ ను కలిసి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. అలాగే క్షేత్రస్థాయి లో కూడా మరి కొంతమందికి తమ పార్టీ కండువా వేస్తున్నారు జగన్.