తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్,టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గ్రేటర్ శనివారం హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రజలు నిత్యం బస్ లలో తిరుగుతూ వారి వారి కార్యక్రమాలు చేసుకుంటున్నారు.
ప్రభుత్వం లో ఉన్న తాము కూడా అప్పుడప్పుడు ఇలా ప్రభుత్వ బస్ లలో తిరిగితేనే వారి వారి, అవసరాలు, సమస్యలు తెలుస్తాయని అన్నారు .మసబ్ ట్యాంక్ లో గల తన కార్యాలయానికి తొలి సారి ఇలా బస్ లో వెళ్లడం ఆహ్లాదకరంగా అనిపించింది అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కే.సి.ఆర్ మహిళల పట్ల చూపిన గౌరవానికి, వారు ఆర్టీసీ బస్ లలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా మహిళలకోసం ప్రత్యకమైన భద్రత ఏర్పాట్లు చేయడం గొప్ప విషయం అని అన్నారు.
ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతుందన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేయూతను అందించి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నదని, ప్రజల యొక్క ఆదరణ కూడా చాలా గొప్పగా ఉందని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా సరిపడా వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.