ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 నుండి కడప జిల్లా ఇడుపులపాయి నుండి ప్రజా సమస్యల స్వయంగా తెలుసుకోవడం కోసం వాటిని భరోస ఇవ్వడం కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నాడు. మూడువేల కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు వైసిపి అధినేత జగన్ మోహన్ శ్రీకారం చుట్టినపుడు “ఇది సాధ్యమా? ఈ రోజుల్లో కూడా పాదయాత్రలు అవసరమా? ” అని అనుకున్న వారికి వైఎస్ జగన్ తీసుకున్ననిర్ణయం ఈరోజు ఒక గుణపాఠం నేర్పుతున్నది. ఒక్కసారి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటే మార్చుకోడు” అనేది స్ఫష్టంగా కనిపిస్తుంది.
see also..2019 సార్వత్రిక ఎన్నికల్లో.. టీడీపీకి నా సపోర్ట్ ఉండదు.. తేల్చేసిన పవన్ కళ్యాణ్..!
పాద యాత్ర మొదట్లో పదిరోజులపాటు వైఎస్ జగన్ తడబడుతున్నట్లు పచ్చ మీడియాలో విపరీతమైన పబ్లిసీటి చేసుకున్నాయి. జగన్ ముఖంలో అలసట, నిస్తేజం కనిపించాయని,అంతేగాక ‘జగన్ నడుము నొప్పితో బాధపడుతున్నాడు, మాలిష్ చేయించుకుంటున్నాడు, కాళ్ళు వాచిపోయాయి, పాదాలు బొబ్బలెక్కాయి… పాదయాత్రకు బ్రేక్ ఇస్తున్నాడు’ అని వార్తలు ప్రచురించాయి. ఇక పాదయాత్ర ఎక్కువకాలం సాగదేమో అనే సందేహం అనే ఆలోచన ప్రజల్లో కుదిరేలా ప్రచారం చేశాయి. కాని ధైర్యంతో…ఎన్ని కష్టాలు వచ్చిన…ఎంతమందిని వందల కోట్లు ఆశ చూపి టీడీపీలోకి లాగిన వైఎస్ జగన్ లో చిరునవ్వు ..ప్రజలకు నేను ఉన్నా…కార్యకర్తను కూడ ఎమ్మెల్యే చేసే దమ్ము నాతో ఉందనే ఆలోచనతో ప్రజలకు భరోసను ఇస్తూ …పాదయాత్ర ముందుకు నడిపిస్తున్నాడు. అంతేకాదు 500 కిలోమీటర్ల మైలురాయి దాటాక సరికొత్త ఉత్సాహవంతుడయ్యాడు జగన్ . మొదట్లో కనిపించిన అలసట, ఆయాసం, నీరసం స్థానంలో నవోత్సాహం, నూతన జవసత్వాలు కనిపిస్తున్నాయి. అమృతపానం చేసిన వాడిలా జగన్ నడక ఇప్పుడు దాదాపు పరుగుగా మారుతున్నది. ఇదంతా ప్రజా సంకల్పబలమే అంటున్నారు.
see also..ఎన్నికల ముందు హత్యలు, దాడులతో ప్రజలను భయపెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య
అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు…
1 . జగన్ పాదయాత్రలో విపరీతంగా జనాదరణ పెరగడం.
2 . ఎక్కడకు వెళ్లినా వేలాదిమంది ప్రజలు మంగళహారతులు పడుతుండటం.
3 . జగన్ యాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారన్న విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వం గుర్తించడం,
4 . టీడీపీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా జనం పట్టించుకోకపోవడం.
5 . ప్రజలకు ఇచ్చిన హామిలతో చంద్రబాబు విఫలం అయ్యారన్న వాస్తవాన్ని ప్రజలు గ్రహించేలా చేయ్యడం
6 . నిరుద్యోగులకు చంద్రబాబు చేసిన మోసం….జగన్ తీవ్రంగా విమర్శించి..భరోస ఇవ్వడం
7 . రైతులకు,మహిళలకు ,ఫించన్ లు రాకుండా చూడడం…రుణమాఫి దెబ్బ.
8 . ప్రత్యేకహోదా కోసం తానిస్తున్న పిలుపుకు అపూర్వ స్పందన రావడం.
9 . దళిత మహిళలను వివస్త్రలను చేసి దాడులు జరపడం…రేప్ లు ఎక్కువగా జరగడం..నేరాలు అన్ని క్లుప్తంగా ప్రజలకు తెలపడం.
10 . అన్నిటిని మించి 2014 కంటే ఇప్పుడు ప్రజాదరణ మరింతగా పెరుగుతన్న సంకేతాలు గోచరిస్తుండటం.
ఈ విదంగా వైఎస్ జగన్ అత్యంత ఉత్సాహంగా తన ప్రజాసంకల్ప యాత్రను కొనసాగిస్తూ ఈ నెల 29న నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో 1000 కిలోమీటర్లు దాటారు. ప్రజాసమస్యలు అనేవి మంత్రుల ఇళ్లలో డైనింగ్ టేబుల్ మీద కాకుండా, ప్రజలమధ్య ఉండి తెలుసుకోవాలి అని నిరుపిస్తున్నాడు వైఎస్ జగన్.