చక్కని సువాసన ,కమ్మని రుచి కొత్తిమీర సొంతం .మనం తినే ఆహార పదార్ధాల రుచిని ఇది రెట్టింపు చేస్తుంది.దీన్ని ఆహారంతో పాటు జ్యూస్ గా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇందులో మిటమిన్ ఎ ,సి ,ఇ,కె లతో పాటు అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి.ప్రతి రోజు కొత్తిమీర ను ఆహారంలో తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
- శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాలను తగ్గించడంలో కొత్తిమీర కీలక పాత్ర పోషిస్తుంది.ఇందులో శరీరానికి అవసరమయ్యే అయిల్స్ రక్తంలోని షుఘర్లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి.షుఘర్ వ్యాధితో బాధపడే వారు కొత్తిమీరను తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
see also : గర్బిణీలు జామపండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే
- కొత్తిమీరలో పీచు శాతం ఎక్కువ .దీన్ని ఆహారంలో తీసుకోవడం వలన శరీరంలో హాని చేసే కొవ్వును తగ్గిస్తుంది.జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.శరీరంలో ఏర్పడ్డ గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది.
see also : రోజు రెండు యాలుకులుతింటే ఏమవుతుందో తెలుసా..?
- ఇది ధమనులు మరియు సిరాల గోడలపై ఏర్పడే కొవ్వును కరిగిస్తుంది.అకస్మాత్తుగా వచ్చే గుండె జబ్బును అరికడుతుంది.గుండె జబ్బును రాకుండా కాపాడి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
- కొత్తిమీరను తరుచుగా తినడం వలన కడుపులో ఏర్పడే వికారం మరియు వాంతి అయ్యేలా వుండే సమస్యలు సమసిపోతాయి అంతే కాకుండా కడుపులో ఏర్పడే సమస్యలను నివారిస్తుంది.
- నోటిలో ఏర్పడే పూతలను పండ్లను నివారిస్తుంది.నోటి దుర్వాసనను అరికడుతుంది.చిగుళ్ళు సమస్యలను నివారిస్తుంది.
see also : ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి త్రాగితే అద్భుతమైన లాభాలు
- కొత్తిమీర లో వుండే కాల్షియం ఎముకలను దృడ పరుస్తుంది.దీన్ని తరుచుగా తీసుకోవడం వల్ల కంటి సమస్యలు కూడా దురం చేసుకోవచ్చు.
- కొత్తిమీర డయేరియాను తగ్గిస్తుంది.ఆకలిని పెంచుతుంది.అంతేకాకుండా స్త్రీ లలో వచ్చే నెలసరి ఇబ్బందులను తగ్గిస్తుంది.
see also : బాదంని కనుక ఇలా తింటే లెక్కలేనన్ని లాభాలు మీ సొంతం..!