ఈ నెల 29న నిర్వహిస్తున్న ‘‘వాక్‌విత్ జగనన్న’’ కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటô శ్వర్లు, అంబటి రాంబాబు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 29వ తేదీ వెయ్యి కిలోమీటర్ల మైలు రాయి దాటనున్న వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా వైసీపీ ఇతర దేశాల్లో ఉన్నఎన్‌ఆర్‌ఐలు మద్దతు ఇస్తున్నారు. మెల్ బోర్న్ లో వైసీపీ కన్వీనర్ మామిడి కౌసిక్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నారు.వీరితో పాటు తోకేష్ రెడ్డి,శఖమూరి రాజేష్ ,యార్లగడ్డ రమ్య, సాయి సురేంద్ర ,కంజుల రమణ రెడ్డి.బవనం భార్గవ్ రెడ్డి,సతీస్ పాటి మరియు తదితరులు‘‘వాక్‌విత్ జగనన్న’’ కార్యక్రమంలో బాగంగా పాదయాత్ర చేస్తున్నారు.అంతేగాక వీటితో పాటు ఐదు మెట్రో సిటీలు, 25 పార్లమెంట్ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 624 మండలాలు, 25 విదేశీ నగరాల్లో వాక్ విత్ జగనన్న కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలని నాయకులు కోరారు.
