వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు అలుపు ఎరగకుండా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో జగన్ పాదయాత్ర నేటికి 73వ రోజుకి చేరుకుంది.
ఈ నేపధ్యంలో నెల్లూరు జిల్లలో కోనసాగుతుంది .జగన్ పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు మండలం మేగనూరుకు చెందిన కె.చెంచమ్మ అనే వృద్ధురాలు..నాయనా.. ఇప్పుడు నాకు వయసు పైబడింది.. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో కోరిక ఉంది నాయనా.. నువ్వు ముఖ్యమంత్రి అయితే నాకు ఆనందంగా ఉంటుందయ్యా అంటూ జగన్తో పేర్కొంది. వెంటనే వైఎస్ జగన్ స్పందిస్తూ మీ లాంటి పెద్దల ఆశీస్సులు, భగవంతుని దయ ఉంటే మన అందరి ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు.